
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి
కోస్గి రూరల్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజేపి పార్టీ నాయకులు సత్తాచాటాలని రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాంతికుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని పార్టి కార్యాలయంలో కొడంగల్ నియోజకవర్గంలోని వివిధ మండలాల ప్రతినిలధులతో ప్రత్యేక సమావేశాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి తోడ్పాటునందించాలని, ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగలన్నారు. కలిసికట్టుగా పని చేస్తే విజయం మనదేనని అన్నారు. ఆనంతరం పలు మండలాల ప్రతినిధులు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికై న సందర్భంగా శాంతికుమార్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మధన్ , నారాయణ , వెంకటేష్ , ప్రశాంత్ చ బద్రినాథ్ తదితరులు ఉన్నారు.
హక్కుల సాధనకు
పోరాడిన నాయకుడు..
నారాయణపేట టౌన్: పేదల హక్కుల సాధన కోసం జీవితాంతం పోరాటం చేసిన గొప్ప నాయకుడు సీతారాం ఏచూరి అని, కార్మిక సమసమాజ స్థాపన చేయడమే ఆయనకు అందించే నిజమైనా నివాళి అని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట్రామిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో సీతారాం వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో ప్రజాతంత్ర లౌకిక శక్తుల ఐక్యత కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మనీయమన్నారు. దేశపార్లమెంట్‌ను ప్రజాసమస్యల చర్చవేదికగా మార్చిన మహోన్నత పార్లమెంటేరియన్ కామ్రేడ్ సీతారాం ఏచూరి అని కొనియాడారు. విద్యార్థి దశనుంచే పోరాటాలు నిర్వహించి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడినట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు గోపాల్, బలరాం, అంజయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి