
ఇస్రోను సందర్శించిన ఉపాధ్యాయులు
నారాయణపేట రూరల్: దేశంలోనే ఎంతో ప్రత్యేకత కల్గిన శ్రీహరికోట సతీశ్ ధావన్ ఉపగ్రహ రాకెట్ల ప్రయోగ కేంద్రాన్ని శుక్రవారం నారాయణపేట జిల్లా సైన్స్ ఉపాధ్యాయులు సందర్శించారు. సీవీ రామన్ సైన్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో 90 మంది ఉపాధ్యాయులు ఉపగ్రహ శాస్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన అనేక విషయాలపై అవగాహన పొందారు. ఇప్పటివరకు శ్రీహరికోట నుంచి ప్రయోగించిన ఉపగ్రహాలు పొందుతున్న ప్రయోజనాలు, భవిష్యత్‌లో చేయబోతున్న ప్రయోగాల వివరాలు అక్కడి శాస్త్రవేత్తలు వివరించారు. ఇస్రోలోని రాకెట్ లాంచింగ్ స్టేషన్స్‌ను, ప్రయోగ పర్యవేక్షణ కేంద్రాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. కార్యక్రమంలో డీఈఓ గోవిందరాజులు, సీఎంఓ రాజేంద్ర కుమార్, ఏఎంఓ విద్యాసాగర్, డి.ఎస్.ఓ భానుప్రకాష్, సెక్టోరియల్ అధికారులు నాగార్జునరెడ్డి, శ్రీనివాస్, యాదయ్యశెట్టి, ఫోరం సబ్యులు రాములు, శశికుమార్, వివిధ సంఘ బాధ్యులు షేర్ కృష్ణారెడ్డి, జనార్దన్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.