
బియ్యం తరలించాలి
ఏప్రిల్ నుంచి ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తుంది. మా వద్ద ఉన్న దొడ్డు బియ్యాన్ని ఇప్పటి వరకు తీసుకోలేదు. రేషన్‌షాపులో స్థలం లేక ఇబ్బంది కలుగుతోంది. దానికితోడు దొడ్డు బియ్యానికి పురుగు వస్తుంది. అది సన్న బియ్యానికి కూడా పట్టే ప్రమాదం ఉంది. వెంటనే దొడ్డు బియ్యం నిల్వలను తరలించాలి.
– సంజీవరెడ్డి, రేషన్ డీలర్, మద్దూరు
ప్రభుత్వానికి నివేదించాం
బఫర్ గోదాం, ఎంఎల్‌ఎస్, రేషన్‌షాపుల్లో ఉన్న దొడ్డు బియ్యం నిల్వలపై ప్రభుత్వానికి నివేదిక అందజేశాం. ప్రభుత్వం నుంచి అదేశాల మేరకు వాటిని తరలించడం జరుగుతుంది. ఇప్పటి వరకు దొడ్డు బియ్యాన్ని తరలించడానికి అదేశాలు రాలేదు. – సైదులు, డీఎం
●

బియ్యం తరలించాలి