
లక్ష ఎకరాలకు సాగునీరుఅందించడమే లక్ష్యంగా..
సీఎం రేవంత్‌రెడ్డి నారాయణపేట – కొడంగల్ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఈ ప్రాంతానికి లక్షా ఎకరాలకు సాగు నీరు అందించడమే లక్ష్యంతో రూ.2950 కోట్లతో శ్రీకారం చుట్టారు. కాగా ప్రాజెక్టులో మరిన్ని చెరువులకు సాగునీరు అందించాలని అంచాన వ్యయాన్ని రూ.4,500 కోట్లకు పెంచారు. 2024 ఫిబ్రవరిలో ఈ ప్రాజెక్టు పునాదులు పడ్డాయి. అయితే ఈ ప్రాజెక్టులో భూ నిర్వాసితులు చేపడుతున్న ఆందోళనలతో సీఎంను ఒకింత కలవరానికి గురిచేస్తుండగా మరో వైపు పరిహారం పెంచకపోతే ప్రాజెక్టు పూర్తి అయ్యే పరిస్థితి కానరావడం లేదనేది సీఎం దృష్టికి వెళ్లడంతో ఏది ఏమైనా ఈ రెండేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనే సంకల్పంతో సీఎం ఎకరానికి రూ. 20లక్షల పరిహారం ఇచ్చేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
సమ్మతి పత్రాలు స్వీకరిస్తున్నాం
పేట– కొడంగల్ ప్రాజెక్టులో భాగంగా ఎకరాకు రూ.20 లక్షల పరిహారం చెల్లించాలని కోరుతున్న భూ నిర్వాసితుల నుంచి సమ్మతి పత్రాలు స్వీకరిస్తున్నాం. ఆ పత్రాలన్నీ ప్రభుత్వానికి నివేదిస్తాం. రూ.20లక్షల పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం నుంచి అధికార ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.
– ఎస్.శ్రీను, జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్
●