
దొడ్డు బియ్యం.. పురుగులపాలు
మద్దూరు: రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం ముక్కిపోతున్నాయి. ఈ ఏడాది మార్చి వరకు లబ్దిదారులకు దొడ్డు బియ్యం పంపిణీ చేయగా.. ఏప్రిల్ నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. అంతకుముందు రేషన్ దుకాణాలకు సరఫరా చేసిన దొడ్డు బియ్యం ఐదు నెలలుగా వృథాగా ఉన్నాయి. దీంతో చాలా చోట్ల ఈ బియ్యం పురుగులు పట్టి, తుట్టెలు( చిట్టెం) కడుతున్నాయి. ప్రభుత్వం దొడ్డు బియ్యం ఆయా చోట్ల నుంచి ఖాళీ చేయకుండానే సన్నబియ్యం స్టాక్ పెట్టింది. దీంతో అప్పటికే నిల్వ ఉన్న దొడ్డుబియ్యం నుంచి పురుగులు సన్న బియ్యానికి పడుతున్నాయి.
పేరుకుపోయిన బియ్యం నిల్వలు
జిల్లాలోని రేషన్ దుకాణాలు, ఎంఎల్‌ఎస్ పాయింట్లు, గోదాముల్లో 1,255 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి. సన్న బియ్యాన్ని పంపిణీ చేసే క్రమంలో రేషన్ షాపుల నుంచి మిగిలి ఉన్న దొడ్డు బియ్యాన్ని ప్రభుత్వం సేకరించలేదు. దీంతో డీలర్లు రేషన్ షాపులోనే ఓ మూలన పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆ బియ్యం పురుగులు, తుట్టెలు పట్టి పనికి రాకుండా పోతుంది.
జిల్లాలో 301 రేషన్ షాపులు
జిల్లాలో 301 రేషన్ షాపులు ఉన్నాయి. ఏప్రిల్ నెలలో సన్న బియ్యం పంపిణీకి ముందు ఆయా రేషన్ షాపుల్లో మొత్తం 59.6695 మొట్రిక్ టన్నుల పైచిలుకు దొడ్డు బియ్యం ఉన్నట్లు అంచనా. అయితే బియ్యం కేటాయింపు నిల్వలంతా రాష్ట్రస్థాయి నుంచే ఆన్‌లైన్ విధానంలో కొనసాగుతుంది. సన్నబియ్యం పంపిణీ సందర్బంలో దొడ్డు బియ్యం నిల్వకు సంబంధించిన ఆన్‌లైన్ నిలిపివేసి.. సన్న బియ్యానికి సంబంధించిన ఆన్‌లైన్ విధానం అమలు చేశారు. దీంతో జిల్లా పౌర సరఫరాల శాఖ అధకారుల వద్ద ఏ రేషన్ షాపుల్లో ఎంత దొడ్డు బియ్యం ఉన్నాయనే సమాచారాన్ని సంబంధిత డీలర్ల నుంచి అధికారులు సేకరించారు.
దొడ్డు బియ్యంపై పట్టింపేది?
జిల్లాలోని గోదాములు, ఎంఎల్‌ఎస్ పాయింట్లతో పాటు రేషన్ షాపుల్లో 1,255 మెట్రిక్ టన్నుల వరకు దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి. ఈ బియ్యంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో వాటిని ఏమి చేయాలో తెలియక రేషన్ డీలర్లు ఇబ్బంది పడుతున్నారు. వేలం ద్వార అమ్మడమా.. లేక ఇతర ప్రాంతాలకు తరలించడమా చేయాలని కోరుతున్నారు.
మూడు ఎంఎల్‌ఎస్ పాయింట్లలో
జిల్లాలో బియ్యం నిల్వలు ఇలా.. (మెట్రిక్ టన్నుల్లో)
171.022
రేషన్ షాపుల్లో ముక్కిపోతున్న దొడ్డు బియ్యం
ఐదు నెలలుగా ఏ నిర్ణయం తీసుకోని అధికారులు
సన్న బియ్యానికి చేరుతున్న పురుగులు
ఇబ్బంది పడుతున్న రేషన్ డీలర్లు
రేషన్ షాపుల్లో
59.6695
బఫర్ గోదాములో
1024.833

దొడ్డు బియ్యం.. పురుగులపాలు