
శోభాయమానంగా..
● గణనాథుడి ఊరేగింపులో
అలంకరణలే ప్రత్యేకం
● సీసీ కెమెరాలతో పర్యవేక్షణ
● జిల్లా కేంద్రంలో
నేటి సాయంత్రం వరకు
కొనసాగనున్న శోభాయాత్ర
నారాయణపేటలో క్రేన్ సాయంతో
గణనాథుడి నిమజ్జనం
ఊట్కూరు పెద్దచెరువులో వినాయకుడిని
నిమజ్జనం చేస్తున్న భక్తులు
నారాయణపేట రూరల్: ఇతిహాసిక సన్నివేశాలు.. కదులుతున్న బొమ్మలు.. విద్యుద్దీపాల అలంకరణలతో శోభాయమానంగా గణేశ్ శోభాయాత్ర కొనసాగుతోంది. గణనాథులను శుక్రవారం రాత్రి 11గంటల తర్వాత శోభాయాత్రకు తరలించారు. జిల్లా కేంద్రంలో ఈ సారి సైతం ప్రత్యేక వాహనాల్లో ఆధ్యాత్మిక, ధార్మిక, రాజకీయ అంశాలతో పాటు సమాజ శ్రేయస్సును కాంక్షించే విషయాలతో అలంకరణలు చేసి ఊరేగింపులో ప్రత్యేకత చాటుకుంటున్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు నృత్యాలు, బొడ్డెమ్మలు చేస్తూ ముందుకు కదిలారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. బాంబు స్కాడ్ బృందాలు అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. శనివారం రాత్రి వరకు జరిగే నిమజ్జనానికి కొండారెడ్డిపల్లి చెరువు దగ్గర ప్రత్యేకంగా క్రేన్లను ఏర్పాటు చేశారు.
మద్దూరులో గణనాథుడి ఎదుట కోలాటం ఆడుతున్న మహిళలు
జిల్లా కేంద్రంలో శాతవాహనకాలనీ శివసేన యువజన సంఘం అడుగుల భజన
రూ.1.65 లక్షలు పలికిన గణేశ్ లడ్డూ
మరికల్: రూ.1.65 లక్షలకు వేలం పాడి గణేశ్ లడ్డూను దక్కించుకున్నాడో భక్తుడు. మరికల్ ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డూ వేలాన్ని శుక్రవారం నిర్వహించారు. రికార్డు స్థాయిల్లో రూ.1.65 లక్షలకు అడిగోని నర్సిములు దక్కించుకున్నాడు. అనంతరం విగ్రహాన్ని నిమజ్జనం నిమిత్తం జూరాలకు తరలించారు.
అశోక్‌నగర్‌లో నరకాసురుడితో యుద్ధం చేస్తున్న
శ్రీకృష్ణుడి అలంకరణలో..

శోభాయమానంగా..

శోభాయమానంగా..

శోభాయమానంగా..

శోభాయమానంగా..

శోభాయమానంగా..

శోభాయమానంగా..