అందుబాటులోకి కొత్త కాలేజీలు | - | Sakshi
Sakshi News home page

అందుబాటులోకి కొత్త కాలేజీలు

Sep 6 2025 8:00 AM | Updated on Sep 6 2025 8:00 AM

అందుబాటులోకి కొత్త కాలేజీలు

అందుబాటులోకి కొత్త కాలేజీలు

మైక్రో బ్రూవరీ ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

ఈ నెల 25వ తేదీ వరకు అవకాశం

మహబూబ్‌నగర్‌ క్రైం: మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో మైక్రో బ్రూవరీ(చిన్న తరహా బీరు పరిశ్రమ) ఏర్పాటు చేసుకోవడానికి తెలంగాణ ఆబ్కారీ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు ఎకై ్సజ్‌ డీసీ విజయ భాస్కర్‌ రెడ్డి, మహబూబ్‌నగర్‌ ఎకై ్సజ్‌ సీఐ వీరారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మొదటిసారి జిల్లాకేంద్రంలో కార్పొరేషన్‌లలో బీరు తయారు చేసి విక్రయాలు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మైక్రో బ్రూవరీ ఏర్పాటుకు వెయ్యి చదరపు మీటర్లతో కూడిన ప్రాంగణం అవసరం ఉంటుందని, దీనికి రూ.1లక్ష డీడీ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. దీని ద్వారా బీరు తయారు చేసి అక్కడే విక్రయాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని, ఆసక్తి కలిగిన వారు దరఖాస్తుతో పాటు రూ.1లక్ష డీడీ, ఆధార్‌ కార్డు, ప్రస్తుతం బార్‌, క్లబ్‌, రెస్టారెంట్‌ ఉంటే వాటి లైసెన్స్‌ జిరాక్స్‌ జత చేసి 25లోగా వరకు ఎనుగొండలోని డీసీ కార్యాలయంలో అందజేయాలని, 87126 58872 సంప్రదించాలని సూచించారు.

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ప్రభుత్వం పాలమూరు యూనివర్సిటీలో ఈ విద్యా సంవత్సరం నుంచే లా, ఇంజినీరింగ్‌ కళాశాలల ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో పీయూలోని అకాడమిక్‌ భవనం పైభాగంలో ఎడమ వైపు ఉన్న తరగతి గదులు ఇంజినీరింగ్‌, కుడి వైపు ఉన్న గదులు లా కళాశాల విద్యార్థులకు కేటాయించారు. కాగా ఆరు నెలల క్రితమే గదుల నిర్మాణం ప్రారంభించగా ఇటీవల పూర్తయ్యాయి. వీటిలో విద్యార్థులకు అవసరమైన డ్యూయెల్‌ డెస్క్‌లు, టేబుళ్లు తదితర వాటిని అధికారులు ఏర్పాటు చేశారు. ఆయా కోర్సుల్లో కలిపి మొత్తం 191 మంది విద్యార్థులను ప్రభుత్వం అలాట్‌ చేసింది. ఇంజినీంగ్‌లో చేరిన విద్యార్థులకు కళాశాలతోపాటు హాస్టల్‌లో చేరేందుకు అధికారులు అవకాశం కల్పించారు. వీరికి కృష్ణవేణి బాలికల హాస్టల్‌ కొత్త భవనంలో వసతి ఏర్పాటు చేశారు. అలాగే వీరు కళాశాలలో ఎలా ఉండాలి.. ఎలా నడుచుకోవాలని అనే అంశాలపై ఓరియంటేషన్‌ కార్యక్రమాలు సైతం నిర్వహించారు. త్వరలో రెండు కళాశాలల తరగతులు ప్రారంభించనున్నారు.

సిబ్బంది నియామకం..

లా, ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులకు తరగతులు బోధించేందుకు గెస్టు ఫ్యాకల్టీని అధికారులు నియమించారు. ఇందులో ఇంజినీరింగ్‌ విభాగంలో మొత్తం మూడు గ్రూప్‌లకు సంబంధించి 11 మందిని అధ్యాపకులకు ఇంటర్వ్యూలు, డెమో చేపట్టిన తర్వాత నియమించారు. అలాగే లా కళాశాలకు సంబంధించి 6 పోస్టుల భర్తీకి బుధవారం అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. మొత్తం 6 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇస్తే 10 మందిని షార్ట్‌లిస్టు చేశారు. త్వరలోనే ఈ ఫలితాలు వెలువడనున్నాయి. వీటితోపాటు లా, ఇంజినీరింగ్‌ కళాశాలలకు నాన్‌ టీచింగ్‌ సిబ్బందిని వివిధ డిపార్ట్‌మెంట్లలో ఉన్నవారిని సర్దుబాటు చేయనున్నారు. మొత్తం 6 మందిని కేటాయించనున్నట్లు తెలుస్తుంది. ఇక లా విద్యార్థులు మొత్తం 120 మంది లా సెట్‌ ద్వారా ఎంపికై , ఆన్‌లైన్‌ వెబ్‌ ఆప్షన్‌ పెట్టుకున్న వారి లిస్టును ప్రభుత్వం పీయూకు పంపించింది. 45 విద్యార్థుల బుధవారం సాయంత్రం నాటికి దరఖాస్తు చేసుకోగా.. మిగతా వారికి గురువారం వరకు పీయూలో చేరేందుకు అధికారులు అవకాశం కల్పించారు.

ఇంజినీరింగ్‌ కళాశాలలో సిద్ధమైన తరగతి గదులు

అధునాతన సౌకర్యాలతో..

పీయూలో నూతనంగా ప్రారంభించనున్న లా, ఇంజినీరింగ్‌ కళాశాలల్లో అన్ని వసతులు కల్పించి ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నాం. ఇంజినీరింగ్‌లో గదులతోపాటు డ్యూయెల్‌ డెస్కుల్‌, టేబుల్స్‌ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. త్వరలో తరగతులు కూడా ప్రారంభం కానున్నాయి. రెండు కళాశాలలకు సంబంధించి సిబ్బంది నియామకం ప్రక్రియ సైతం పూర్తయ్యింది.

– శ్రీనివాస్‌, వైస్‌ చాన్స్‌లర్‌, పీయూ

అడ్మిషన్లు కొనసాగుతున్నాయి.

పీయూ లా కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. 120 మందితో పీయూను ఆన్‌లైన్‌లో ఎంపిక చేసుకున్నారు. ఇప్పటికే 45 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు. విద్యార్థులకు కళాశాలలో పూర్తిస్థాయిలో నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నాం.

– మాళవి, లా కళాశాల ప్రిన్సిపాల్‌

పీయూలో లా, ఇంజినీరింగ్‌ కళాశాలల ముస్తాబు

పూర్తయిన తరగతి గదుల నిర్మాణం, డ్యూయెల్‌ డెస్కుల ఏర్పాటు

ఆయా కోర్సులో ఇప్పటికేపూర్తయిన అడ్మిషన్ల ప్రక్రియ

‘లా’లో 45 మంది, ఇంజినీరింగ్‌లో 191 మంది చేరిక

ఓరియంటేషన్‌ క్లాస్‌లు పూర్తి.. త్వరలో తరగతులు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement