సోలార్‌పై నజర్‌ | - | Sakshi
Sakshi News home page

సోలార్‌పై నజర్‌

Sep 6 2025 8:00 AM | Updated on Sep 6 2025 8:00 AM

సోలార

సోలార్‌పై నజర్‌

జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై ప్లాంట్ల ఏర్పాటు

ఎక్కడి విద్యుత్‌ అక్కడే

వినియోగం

మిగిలిన విద్యుత్‌ డిస్కమ్‌కు..

జిల్లాలో 1.45 లక్షల విద్యుత్‌ కనెక్షన్లు.. నిత్యం 3.99 మి.యూనిట్ల విద్యుత్‌ వినియోగం

మద్దూరు: సాంప్రదాయేతర ఇంధన వనరుల దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పంచాయతీ కార్యాలయం మొదలుకొని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌, సెక్రటేరియేట్‌ వరకు అన్ని ప్రభుత్వ భవనాలపై సోలార్‌ పవర్‌ ప్యానెళ్లు ఏర్పాటు చేసి సౌర విద్యుత్‌ ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇటీవల ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్ని జిల్లా కలెక్టర్లతో దీనిపై వీడియో సదస్సు నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి వినియోగం పెంచేందుకు రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుందని వివరించారు.

భారీగా విద్యుత్‌ వినియోగం

గ్రామస్థాయి నుంచి పట్టణ ప్రాంతాల వరకు నిత్యం విద్యుత్‌ వినియోగం భారీగా పెరిగింది. జిల్లాలో నివాస, వ్యవసాయ, రైస్‌ మిల్లుల, క్రషర్‌ మిషన్లు, ఇతర కర్మాగారాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు తదితరాలు కలిపి జిల్లాలో 1.45 లక్షల విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. వీటికి నిత్యం 3.99 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అవసరం అవుతుంది. ఈ సీజన్‌ మాత్రమే ఇంత విద్యుత్‌ అవసరం ఉంది. వేసవి కాలంలో దాదాపు 4.5 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అవసరం అవుతుందని అధికారులు తెలిపారు. ప్రతీ ఏటా 10 శాతం నుంచి 20 శాతం విద్యుత్‌ వినియోగం పెరుగుతోంది. పదేళ్ల క్రితం జిల్లాలో 2 నుంచి 3 మిలియన్‌ యూనిట్లు అవసరం ఉండగా అది ప్రస్తుతం రెట్టంపు దశకు చేరుకుంది. సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అఽథారటీ (సీఈఏ) అంచనాల ప్రకారం వచ్చే మూడేళ్లలో 2028 నాటికి మరింత డిమాండ్‌ ఏర్పడనుందని అంచనా వేసింది. ఇందుకోసం వచ్చే పదేళ్ల నాటికి థర్మల్‌ పవర్‌ కంటే సౌర విద్యుత్‌ ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించారు.

నివేదిక అందజేశాం

ప్రభుత్వా అదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్‌ ఏర్పాటు కోసం మా సిబ్బందిచే సర్వే నిర్వహించాం. ఈ నివేదికన ప్రభుత్వానికి పంపించాం. ప్రభుత్వం నిర్ణయం మేరకు సోలార్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది.

– వెంకటరమణ, ట్రాన్స్‌కో ఎస్‌ఈ

ఎక్కడికక్కడ విద్యుత్‌ ఉత్పత్తి

సోలార్‌ పవర్‌ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా ఎక్కడికక్కడ విద్యుత్‌ ఉత్పత్తి చేసి సదరు కార్యాలయాలకు వినియోగించుకోవాలని, మిగిలిన విద్యుత్‌ను డిస్కమ్‌కు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిస్కమ్‌ వారు తీసుకున్న విద్యుత్‌ను వినియోదారులకు అందిస్తారు. ప్రతీ కార్యాలయం వద్ద మీటర్లను ఏర్పాటు చేసి ఇంపోర్ట్‌ (విద్యుత్‌ ఉత్పత్తి), ఎక్స్‌పోర్ట్‌( డిస్కమ్‌కు ఇవ్వడం) రీడింగ్‌ను నమోదు చేయనున్నారు.

ప్రభుత్వానికి

నివేదిక అందజేత

జిల్లాలోని అన్ని శాఖల ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, జానియర్‌, డిగ్రీ కళాశాలలు, ఉన్నత విద్యా సంస్థలు, మార్కెటింగ్‌ శాఖ పరధిలోని గిడ్డంగులు, అంగన్‌వాడీలు, జీపీభవనాలు భవనాలపై రూఫ్‌ టాప్‌ సోలార్‌ పవర్‌ప్లాంట్ల ఏర్పాటు కోసం రాష్ట్ర స్థాయి నుంచి వచ్చిన సర్వే బృందంతో కలిసి స్థానిక విద్యుత్‌ అధికారులు ప్రభుత్వ భవనాలపై రూప్‌టాప్‌ల ఏరియా కొలిచి పంపించారు. ఈ నివేదికను ప్రభుత్వానికి అందజేసినట్లు అధికారులు తెలియజేశారు.

సోలార్‌పై నజర్‌ 1
1/3

సోలార్‌పై నజర్‌

సోలార్‌పై నజర్‌ 2
2/3

సోలార్‌పై నజర్‌

సోలార్‌పై నజర్‌ 3
3/3

సోలార్‌పై నజర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement