
పేటకు చేరిన బైక్ యాత్ర
నారాయణపేట రూరల్: గిన్నిస్ బుక్‌లో చోటు కోసం ఓ వ్యక్తి బైక్‌యాత్ర చేస్తూ ఆదివారం జిల్లాకేంద్రానికి చేరుకున్నారు. కర్ణాటకలోని బెంగళూర్‌కు చెందిన దివాకర్‌రెడ్డి దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు సుమారు 806 జిల్లాల మీదుగా రెండేళ్ల పాటు రెండు లక్షల కిలోమీటర్ల యాత్రకు సిద్దపడ్డాడు. 2023, నవంబర్ 1న బెంగుళూర్‌లో ప్రారంభమైన యాత్ర ఉత్తర భారతంలో 657 రోజుల్లో 18 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా 88 వేల కిలోమీటర్లు ప్రయాణించి ఆదివారం రాత్రి జిల్లాకేంద్రానికి చేరుకున్నారు. ఒకే దేశంలో అత్యధిక దూరం ప్రయాణించిన వ్యక్తిగా చరిత్ర సృష్టించి గిన్నిస్ రికార్డు పొందాలన్నది తన ఆశయంగా చెప్పుకొచ్చారు.