
చెరువులకు జలకళ
–8లో u
నారాయణపేట: జిల్లావ్యాప్తంగా ఆగస్టులో కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. జూనన్‌లో వరణుడు కరుణించకపోవడంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. జూలైలో అంతంత మాత్రంగానే కురిశాయి. ఈ రెండు నెలల్లో కురిసిన వర్షాలకు జిల్లావ్యాప్తంగా ఉన్న 769 చెరువుల్లో ఒక్కటి కూడా మత్తడి దూకలేదు. కానీ ఆగస్టులో కురిసిన వర్షాలతో 360 చెరువులు నిండి అలుగు పారాయి. జిల్లాలోని సంగంబండ రిజర్వాయర్ నిండటంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. భూత్పూర్ రిజర్వాయర్ నిండుకుండను తలపిస్తోంది. కృష్ణమ్మ పరవళ్లతో నది పరీవాహక ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆనందం.. ఆందోళన...
ఆగస్టు మొదటి వారంలో కురిసిన వర్షాలకు పత్తి రైతులు ఊపిరి పీల్చుకున్నారు. అదే నెల 15 తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు పత్తి, కంది ఇతర మెట్టపంటలు దెబ్బతిన్నాయి. మరోవైపు వరి సాగు చేసిన రైతుల్లో ఆనందం కనిపిస్తోంది.
జూన్‌లో లోటు.. ఆగస్టులో అత్యధిక వర్షపాతం నమోదు
జిల్లావ్యాప్తంగా అలుగుపారిన360 చెరువులు
8 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు
పెరిగిన సాగు విస్తీర్ణం