
గర్భిణి పోలీస్‌కు సన్మానం
మక్తల్: స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహించే మహిళా పోలీస్ చైతన్య ఏడు నెలల గర్భిణి కావడంతో ప్రసూతి సెలవులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం పోలీస్‌స్టేషన్‌లోనే సీఐ రాంలాల్, ఎస్‌ఐలు భాగ్యలక్ష్మిరెడ్డి, రేవతితో పాటు సహచర సిబ్బంది ఆమెకు సీమంత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చీరలు, పూలు, పండ్లు, తినుబండారాలు పెట్టి సన్మానించారు. పండింటి బిడ్డకు జన్మనివ్వాలని ఆకాంక్షించారు. విధి నిర్వహణలో ఉన్న గర్భిణి కానిస్టేబుల్‌పై ఉన్నతాధికారులు చూపించే ఆప్యాయతను చూసిన స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
27న గ్రామ పాలనాధికారుల పరీక్ష
నారాయణపేట: గ్రామ పాలనాధికారుల రెండో దఫా పరీక్ష ఈ నెల 27న నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ సంచిత్‌గంగ్వార్ తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. పరీక్ష నిర్వహణకు సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. అభ్యర్థులు పాస్‌పోర్ట్ ఫొటోను హాల్ టికెట్‌లో నిర్ణీత స్థలంలో అతికించాలని సూచించారు. హాల్ టికెట్‌ను పరీక్షా కేంద్రం ప్రవేశ ద్వారం, హాల్‌లో చూపించాలని, లేని పక్షంలో అభ్యర్థులు పరీక్ష రాయడానికి అనర్హులని హెచ్చరించారు. అంతేకాకుండా అభ్యర్థి నామినల్ రోల్స్‌లో అతికించడానికి పరీక్షా హాల్‌లో ఒక పాస్‌పోర్ట్ సైజు ఫొటోను సమర్పించాలని సూచించారు. అభ్యర్థులు ఎలక్ట్రానిక్ లేదా ఇతర గాడ్జెట్లను తమ వెంట తీసుకు రావొద్దన్నారు. జీపీఓ పరీక్షకు సంబంధించిన మరిన్ని వివరాలకు 91542 83913 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించవచ్చని ఆయనతెలిపారు.
జములమ్మ హుండీ ఆదాయం రూ.29 లక్షలు
గద్వాల న్యూటౌన్: గద్వాల ప్రాంతంలో ప్రసిద్ధిగాంచిన జములమ్మ ఆలయ హుండీని శుక్రవారం లెక్కించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిశీలకురాలు వెంకటేశ్వరి, ఆలయ ఈఓ పురంధర్‌కుమార్, చైర్మన్ వెంకట్రాములు యూనియన్ బ్యాంక్ అధికారుల సమక్షంలో భక్తులు నాలుగు నెలలకుగాను హుండీ లెక్కింపు నిర్వహించారు. హుండీ ద్వారా నగదు రూ. 29.34లక్షలతో పాటు అర కేజీ మిశ్రమ వెండి ఆలయానికి ఆదాయంగా సమకూరింది. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
ఉద్యాన పంటల సాగుతో అధిక లాభాలు
ఇటిక్యాల: రైతులు ఉద్యాన పంటలను సాగు చేసి అధిక లాభాలు పొందవచ్చునని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి అక్బర్ అన్నారు. శుక్రవారం మండలంలోని మునగాలలో రైతు కుర్వ మల్లేష్ సాగుచేస్తున్న కూరగాయల పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు అధిక ఆదాయం ఇచ్చే కూరగాయలు, ఆయిల్‌పాం పంటలపై ప్రత్యేక దృష్టి సారించాలని, కూరగాయల సాగుకు ప్రభుత్వం వివిధ పధకాల నుంచి రాయితీని అందిస్తుందన్నారు. కలుపు సమస్య లేకుండా నీటిని ఆదా చేసుకుంటూ ప్లాస్టిక్ మల్చింగ్ పథకానికి 50 శాతం రాయితీ లభిస్తోందన్నారు. ఒక హెక్టార్‌కు రూ.20 వేల చొప్పున ఒక్కో రైతుకు రెండు హెక్టార్ల వరకు అందిస్తామని, అదే విధంగా తీగజాతి కూరగాయలు బీర, కాకర, సొరకాయ సాగు రైతులకు శాశ్వత పందిళ్ల నిర్మాణానికి అర ఎకరానికి రూ. 50 వేలు రాయితీని కల్పించబడుతుందని అన్నారు.కార్యక్రమంలో డివిజినల్ ఉద్వాన అధికారి రాజశేఖర్, సిబ్బంది ఇమ్రానా, మహేష్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

గర్భిణి పోలీస్‌కు సన్మానం

గర్భిణి పోలీస్‌కు సన్మానం