
ఎకరాకు రూ. 30లక్షల పరిహారం ఇవ్వాలి
ఊట్కూరు: మక్తల్–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో కోల్పోతున్న భూములకు న్యాయమైన పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని గాంధీజీ విగ్రహం వద్ద దంతన్‌పల్లి శివారు రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భూ నష్టపరిహారాన్ని రూ.14 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచాలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదన్నారు. ఊట్కూరు మండలంలో భూముల ధరలు బహిరంగ మార్కెట్‌లో ఎకరా రూ. 30లక్షల నుంచి రూ. 60లక్షల వరకు పలుకుతుందన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఎకరాకు రూ. 30లక్షల నష్టపరిహారం చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో రైతులు సురేందర్‌రెడ్డి, తరుణ్‌రెడ్డి, రాంరెడ్డి, డా.రాఘవేందర్‌గౌడ్, బాలరాజు పాల్గొన్నారు.