
బీజేపీని సంస్థాతంగా బలోపేతం చేయాలి
నారాయణపేట: బీజేపిని సంస్థాగతంగా బలోపేతం చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏ.శ్రీనివాసులు తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్ అధ్యక్షతన నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ బలోపేతం బాధ్యత ప్రతి కార్యకర్త పై ఉందన్నారు. బడుగు, బలహీన వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలపై క్షేత్రస్థాయిలో వివరించి పార్టీ వైపు ఆకర్షితులయ్యేలా చేయాలన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలిపించే దిశగా కృషి చేయాలన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపే లక్ష్యంగా బూత్‌స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. పార్టీలోని అన్ని శ్రేణులు ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. ప్రజలను పార్టీ వైపు ఆకర్షితులను చేసియ పార్టీకి ఓటు వేసే దిశగా చైతన్యం చేయాలని సూచించారు. ప్రస్తుతం తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్‌తో యుద్దాన్ని ఎంతో చాకచక్యంగా ఎదుర్కొంటున్నరన్నారు. సహోసోపేత నిర్ణయాన్ని తీసుకోవడం పట్ల దేశ ప్రజలు మోదీ అభినందించారన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నేతలు నాగూరావు నామాజీ, కొండయ్య, అట్లూరి రామకృష్ణ, నాయకులు పున్నం చంద్ లాహోటి, సాయిబన్న, పోషల్ వినోద్, శ్రీనివాసులు, రఘురామయ్యగౌడ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.