
జీపీఓ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి
నారాయణపేట: ఈ నెల 25న జరిగే గ్రామ పాలన ఆఫీసర్ (జీపీఓ) పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జీపీఓ పరీక్షలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 25న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరిగే జీపీఓ పరీక్షలో 109 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. నారాయణపేటలోని శ్రీవేద సరస్వతి జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసినట్లు అభ్యర్థులు హాల్ టికెట్లపై హెచ్‌ఓడీ అటెస్ట్ చేయించాలన్నారు. అలాగే ఐడి ఫ్రూఫ్ తీసుకొని పరీక్షకు హాజరుకావాలని హెల్ప్‌లైన్ నంబర్ 9154283913 ఉంటుందని తెలిపారు. ఈ పరీక్ష కేంద్రాలలో ఎస్పీ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తారని, ఆర్డీఓ పర్యవేక్షిస్తారని తెలిపారు. డీఈఓ సీసీ కెమెరాలు.. అభ్యర్థుల హాజరు, గుర్తింపు విధులను నోడల్ అధికారులు పర్యవేక్షించాలన్నారు. డీఎంహెచ్‌ఓ పరీక్ష కేంద్రాల వద్ద ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో డీటీఓ హరిప్రసాద్, ఏఓ జయసుధ, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.