
సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేద్దాం
మక్తల్/నర్వ: సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దామని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం నర్వలో డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అబ్జర్వర్లు సంధ్యారెడ్డి, వేణుగౌడ్ హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ గ్రామాన పార్టీ కార్యవర్గాలను, మండల కార్యవర్గాలను పూర్తిచేయాలని ఆదేశించారు. కార్యవర్గాలను ఏర్పాటు చేసుకునేందుకు దరఖాస్తులను ఆహ్వానించాలని, పార్టీ సూచనల మేరకు ఎన్నిక నిర్వహించి కార్యవర్గాలను పూర్తిచేయాలని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయకేతనం ఎగిరేలా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో నాయకులు కొత్తకోట సిద్దార్థారెడ్డి, పోలీస్ జగన్‌మోహన్‌రెడ్డి, జగదభిరామ్‌రెడ్డి, చెన్నయ్యసాగర్, కృష్ణారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శరణప్ప, వివేకవర్దన్‌రెడ్డి, రాధమ్మ, రవీందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
రోగులకు ఉచిత భోజనం
మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చే రోగులకు ఉచితంగా భోజనం అందజేస్తామని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం ఆయన మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు ఉచిత భోజనాన్ని అందించి ప్రారంభించారు. అంతకు ముందు మండల కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వమించారు. కాంగ్రెస్ పార్టీ మండల, గ్రామ అధ్యక్షుల నియామకం కొరకు అర్హులైన వారినుంచి దరఖాస్తులు స్వీకరించారు.