
ప్రతి విద్యార్థికి ప్రత్యేక మెడికల్ ఐడీ
నారాయణపేట: ఆర్‌బీఎస్‌కే వైద్యబృందాల ద్వారా విద్యార్థుల ఆరోగ్య సమస్యలు పరిష్కరించడానికి వీలు కలుగుతుందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. స్క్రీనింగ్, ట్రీట్‌మెంట్, రెఫరల్ మెరుగునకు సిబ్బందికి తగిన సూచనలు చేశారు. ప్రతి విద్యార్థి ఆరోగ్య సమాచారానికి ప్రత్యేక మెడికల్ ఐడీ ఉండాలని సూచించారు. వైద్య, విద్యశాఖలు సమన్వయంతో పనిచేస్తూ కార్యక్రమాన్ని మరింత మెరుగుపర్చాలన్నారు. విద్యార్థుల ఆరోగ్య సమాచారం మరింత స్పష్టంగా ఉండేలా వెబ్‌పోర్టల్‌లో తగిన మార్పులు చేయాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, డీఎంహెచ్‌ఓ డా.జయచంద్ర మోహన్, కో–ఆర్డినేటర్ డా. శైలజ, ఎస్‌ఓ సాగర్, డా. మోనేష్, సూపర్‌వైజర్ గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.