
సరిహద్దు చెక్‌పోస్ట్ తనిఖీ చేసిన ఎస్పీ
నారాయణపేట రూరల్: మండలంలోని జలాల్‌పూర్ శివారులో ఉన్న అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్‌ను శుక్రవారం ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే వానాకాలం సీజన్‌లో కర్ణాటక నుంచి రాష్ట్రంలోకి వరి ధాన్యం రాకుండా అడ్డుకునేందుకు జిల్లా సరిహద్దుల్లో ఆరు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీసు, రెవెన్యూ తదితర శాఖల అధికారుల సమన్వయంతో పూర్తిస్థాయిలో నిఘా ఉంచామని.. వరి ధాన్యం వాహనాల వే బిల్లులు పరిశీలించి అనుమతించాలని, సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ప్రతి వాహనానికి సంబంధించిన వివరాలను నమోదు చేయాలని, వ్యాపారస్తులపై నిఘా ఉంచాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఆర్టీసీలో
కండక్టర్ల బదిలీలు
స్టేషన్ మహబూబ్‌నగర్: ఉమ్మడి జిల్లాలోని పది ఆర్టీసీ (రీజియన్) డిపోల్లో పనిచేస్తున్న 89 మంది కండక్టర్లకు వారి అభ్యర్థన మేరకు బదిలీలు జరిగాయి. ఈ సందర్భంగా ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలు చేపట్టి 80 మంది అభ్యర్థులకు కండక్టర్లుగా వివిధ డిపోల్లో పోస్టింగులు ఇచ్చామని, అలాగే 89 మంది రెగ్యులర్ కండక్టర్లకు వారి అభ్యర్థన మేరకు బ దిలీలు చేశామని ఆర్‌ఎం తెలిపారు. ఎంతోకా లంగా ఎదురుచూస్తున్న తమ బదిలీలను చేపట్టినందుకు కండక్టర్లు సంతోషం వ్యక్తం చేశా రు. ఆర్‌ఎంకు వారు కృతజ్ఞతలు పేర్కొన్నారు.