
ఆస్పత్రి పనుల్లో వేగం పెంచాలి
మాగనూర్ (మక్తల్): నియోజకవర్గ కేంద్రంలో రూ.50 కోట్లతో నిర్మిస్తున్న 150 పడకల ఆస్పత్రి పనులను శుక్రవారం మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెనుకబడిన ప్రాంతంలో నిర్మితమవుతున్న 150 పడకల ఆస్పత్రి భవనాన్ని నాణ్యతతో చేపట్టాలని సూచించారు. పనుల విషయంలో సంబంధిత కాంట్రాక్టర్ ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా పనులు చేయించాలని.. నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బి.గణేష్‌కుమార్, డైరెక్టర్లు పసుల రంజిత్‌రెడ్డి, సాలంబిన్ ఉమర్ బస్రవి, అంజి, కాంగ్రెస్ నాయకులు కట్టా సురేష్‌కుమార్, కోళ్ల వెంకటేష్, బోయ రవికుమార్, కావలి తాయప్ప, బోయ వెంకటేష్, సీఎస్ మూర్తి, కట్టా వెంకటేష్, వాకిటి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.