సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్‌ పిటిషన్‌ | Supreme Court To Consider granting Interim Bail to Arvind Kejriwal on may 6 | Sakshi
Sakshi News home page

సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్‌ పిటిషన్‌

May 7 2024 10:32 AM | Updated on May 7 2024 12:42 PM

Supreme Court To Consider granting Interim Bail to Arvind Kejriwal on may 6

ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం మనీలాండరింగ్‌ కేసులో అరెస్టై.. తిహార్‌ జైలులో జ్యూడిషియల్‌ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది. కేజ్రీవాల్‌ తరఫున ఆప్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, దిపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మానం విచారణ జరుపనుంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్‌ మధ్యంతర బెయిల్‌ అంశాన్ని పరిశీలిస్తామని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)కి సుప్రీం కోర్టు తెలిపింది.  

కేజ్రీవాల్‌ విచారణకు సమయం పట్టే అవకాశం ఉన్నందున.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర బెయిల్‌ పరిశీలిస్తామని సుప్రీం కోర్టు మే 3వ తేదీన  పేర్కొంది. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోలేదని, కేవలం సమాచారం అందిస్తున్నామని సుప్రీం కోర్టు ఈడీ తరఫు న్యాయవాదికి తెలియజేసింది.

దీనికంటే ముందు జరిగిన విచారణలో లోక్‌సభ ఎన్నికల ముందు సీఎం కేజ్రీవాల్‌ను ఎందుకు అరెస్ట్‌ చేయాల్సి వచ్చిందని ఈడీని సుప్రీం కోర్టు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ రోజు జరిగే మధ్యంతర బెయిల్‌ విచారణలో సుప్రీం కోర్టు వెల్లడించే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement