న్యాయ సేవల వాహనంతో హక్కులపై చైతన్యం | - | Sakshi
Sakshi News home page

న్యాయ సేవల వాహనంతో హక్కులపై చైతన్యం

Apr 28 2026 8:05 AM | Updated on Apr 28 2026 8:05 AM

కర్నూలు: జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవా సదన్‌లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి న్యాయ సేవల వాహనాన్ని ప్రారంభించారు. ప్రజలకు న్యాయ అవగాహన, న్యాయ సహాయం, హక్కులపై చైతన్యం కలిగించడం కోసం ఏపీ స్టేట్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్యాట్రన్‌ ఇన్‌ చీఫ్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ ప్రతి జిల్లాకు న్యాయ సేవల వాహనాన్ని అందుబాటులోకి తెచ్చారన్నారు. హక్కులపై ప్రజల్లో చైతన్యం కలిగించే సాధనంగా ఈ వాహనం ఉపయోగపడుతుందన్నారు. లీగల్‌ సర్వీస్‌ అథారిటీ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి మాట్లాడుతూ ప్రతి మారుమూల ప్రాంతాల్లో బలహీన వర్గాలకు న్యాయాన్ని ఈ వాహనం చేరువ చేస్తుందన్నారు. శాశ్విత లోక్‌ అదాలత్‌ చైర్మన్‌ వెంకటహరినాథ్‌, లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ చీఫ్‌ శివరామచంద్రరావు, న్యాయవాదులు, ట్రైనీ న్యాయవాదులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement