పొలం పనులు చేసుకుంటున్నా | - | Sakshi
Sakshi News home page

పొలం పనులు చేసుకుంటున్నా

Apr 27 2026 8:00 AM | Updated on Apr 27 2026 8:00 AM

పొలం పనులు చేసుకుంటున్నా వలంటీర్‌ వ్యవస్థను కొనసాగించాలి

గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లపాటు వలంటీర్‌గా ప్రజలకు సేవలందించాను. ఆ ప్రభుత్వం ప్రతి నెలా రూ. 5వేల గౌరవ వేతనం అందించింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వలంటీర్‌ వ్యవస్థను కొనసాగిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఒక్కో వలంటీర్‌కు నెలకు రూ. 10 వేలు వేతనం ఇస్తామని ప్రకటించారు. హామీ అమలు చేయకపోవడంతో ఎలాంటి ఉద్యోగం లేక పొలం పనులు చేసుకుంటూ భార్య, కుమార్తెను పోషించుకుంటూ కాలం నెట్టుకొస్తున్నాను.

– నాగరాజు, మాజీ వలంటీర్‌, కోవెలకుంట్ల

తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు వలంటీర్లను పట్టించుకోలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి నెలా గౌరవ వేతనంతోపాటు ప్రతిఏటా ఉగాది పండుగ సందర్భంగా వలంటీర్లను సేవా మిత్ర, సేవారత్న, సేవావజ్ర వంటి బిరుదులతో సత్కరించి ఆర్థికంగా ఆదుకుంది. ప్రస్తుత ప్రభుత్వం వలంటీర్‌ వ్యవస్థను అమలు చేసి ప్రతి నెలా రూ. 10 వేల గౌరవ వేతనం ఇచ్చి ఆదుకోవాలి.

– సౌజన్య, మాజీ వలంటీర్‌,

వల్లంపాడు, కోవెలకుంట్ల మండలం

Advertisement
 
Advertisement
Advertisement