జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన వలంటీర్ల వివరాలు
నియోజకవర్గం వలంటీర్లు
బనగానపల్లె 1,564
ఆళ్లగడ్డ 1,495
నంద్యాల 1,542
నందికొట్కూరు 1,376
డోన్ 1,435
శ్రీశైలం 1,241
పాణ్యం, గడివేముల 1,855
కోవెలకుంట్ల: ఎన్నికల ముందు ‘నీకు రూ. 10 వేలు.. నీకు రూ. 15 వేలు.. నీకు రూ. 20 వేలు’.. అంటూ కూటమి నేతలు అన్ని వర్గాలను నమ్మించి మోసం చేశారు. వారిలో నిలువునా మోసపోయిన వారి జాబితాలో మొదటి స్థానం గ్రామ, వార్డు వలంటీర్లదే. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం వలంటీర్ వ్యవస్థను తుంగలో తొక్కి ఆ ఊసే లేకుండా చేసింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వలంటీర్ వ్యవస్థను అమలు చేసి ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల్లో వారిని కీలకం చేసింది. ప్రతి నెలా ఐదు వేల రూపాయల గౌరవ వేతనం అందించగా ఐదేళ్లపాటు వలంటీర్లు ప్రజలకు ఇళ్ల వద్దనే వివిధ సేవలందించి ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారిధిలా పని చేశారు. వలంటీర్లను నెలకు రూ. 10 వేల గౌరవ వేతనం ఇస్తామని గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లు కావస్తున్నా వలంటీర్లను పట్టించుకోలేదు. గౌరవ వేతనం అటుంచితే వారికి ఎక్కడా ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయలేదు. జిల్లాలోని 29 మండలాల పరిధిలో గత ప్రభుత్వ హయాంలో 10,508 మంది గ్రామ, వార్డు వలంటీర్లు విధులు నిర్వర్తించారు. ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటి వరకు వలంటీర్ వ్యవస్థ పేరెత్తక పోవడంతో చంద్రబాబు ప్రభుత్వంలో అన్ని విధాలా మేలు జరుగుతుందని భావించిన వలంటీర్లకు నిరాశే మిగిలింది.


