● వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2019 ఆగస్టు నెలలో వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. గ్రామ సచివాలయ, వలంటీర్ వ్యవస్థ ద్వారా వలంటీర్లు ప్రభుత్వ సంక్షేమ ఫలాలను కుల, మల, రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రమాణికంగా గడప వద్దకు చేర్చారు.
● కరోనా కష్టకాలంలో వలంటీర్లు కరోనా వారియ ర్స్‌గా పనిచేశారు. కరోనా బారినపడిన వ్యక్తుల వద్దకు వెళ్లేందుకు కుటుంబ సభ్యులు వెనుకాడారు. అలాంటి తరుణంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వలంటీర్లు కరోనా బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి వారికి మందులు, ఆహారం సరఫరా చేయడంలో కీలకపాత్ర పోషించారు.
● ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల వర్తింపులో వలంటీర్లదే ముఖ్యపాత్ర. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, చేనేతలు, త దితర లబ్ధిదారులకు ప్రతి నెలా 1వ తేదీన తెల్లవారుజామునే క్రమం తప్పకుండా ఇంటివద్దనే పింఛ న్లు అందజేశారు. ఇంటి తలుపుతట్టి లబ్ధిదారులను నిద్రలేపి మరీ ిపింఛన్లను ఠంచన్‌గా అందజేశారు.
● వైఎస్సార్ పింఛన్ కానుకతోపాటు వైఎస్సార్ చేయూత, ఆసరా, జగనన్న అమ్మఒడి, రైతు భరోసా, జగనన్న విద్యాదీవెన, వసతిదీవెన, విద్యార్థులు, లబ్ధిదారులకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, సున్నావడ్డీ రుణాలు, పంటల బీమా, డ్వాక్రా మహిళలకు సున్నావడ్డీ, కల్యాణమస్తు వంటి పథకాల వర్తింపులో వలంటీర్లు ముఖ్యపాత్ర పోషించారు.
● సంక్షేమ పథకాలతో పాటు జిల్లాలో అర్హత ఉన్న 48వేల కుటుంబాలకు ఇంటి స్థలంతో పాటు పక్కా గృహాల మంజూరుకు వలంటీర్లు ఎంతగానో కృషి చేసి పేదలకు సొంతింటి కల నెరవేరడంలో వారధిగా నిలిచారు.
● ప్రజలకు విశిష్ట సేవలందించిన వలంటీర్లకు ఏటా ఉగాది పండుగ రోజున సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర బిరుదులతో సత్కరించి రూ. 10 వేలు, రూ. 20 వేలు, రూ. 30 వేలు ప్రోత్సాహక నగదు అందించి అభినందించారు.


