ఎండలకు ఉక్కిరిబిక్కిరి | - | Sakshi
Sakshi News home page

ఎండలకు ఉక్కిరిబిక్కిరి

Apr 25 2026 8:18 AM | Updated on Apr 25 2026 8:18 AM

వేసవి సెలవులు ఇవ్వాలి

అంగన్‌వాడీ కేంద్రాలను ప్రతి రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించాల్సి ఉంది. అయితే వేసవి కాలాన్ని దృిష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పనివేళలను కుదించింది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఎండతీవ్రత అధికంగా ఉండటంతోపాటు ఉక్కపోతతో కేంద్రాల్లో చిన్నారులు అల్లాడిపోతున్నా రు. మధ్యాహ్న భోజనం అనంతరం చిన్నారులను ఇళ్లకు పంపివేసి కార్యకర్తలు, ఆయాలు ఇళ్లకు వెళుతున్నారు. వేసవికాలం ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు 50 రోజులు వేసవి సెలవులు వచ్చాయి. అయితే వేసవికాలంలో సైతం అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు ఉండాల్సి రావడంతో వారి తల్లిదండ్రులు, అంగన్‌వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కోవెలకుంట్ల: ఏటా వేసవికాలం ప్రారంభం కాగానే మార్చి 15 నుంచి పాఠశాలలకు ఒంటి పూటబడులు, ఏప్రిల్‌ 24వ తేదీ నుంచి వేసవి సెలవులు ఇస్తున్నారు. పూర్వప్రాథమిక విద్యనభ్యసించే అభం, శుభం తెలియని చిన్నారులకు వేసవికాలం శిక్ష తప్పడం లేదు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించగా అంగన్‌వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు వర్తింపచేయకుండా కూటమి సర్కార్‌ చిన్నారుల జీవితాలతో చెలగాటమాడుతోంది. జిల్లాలోని 29 మండలాల పరిధిలో1,622 అంగన్‌వాడీ, 40 మినీ కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో 1.23 లక్షల మంది సున్న నుంచి 6 సంవత్సరాల్లోపు చిన్నారులకు 1,662 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు పూర్వప్రాథమిక విద్యను బోధిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు గత నెల 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తుండగా అంగన్‌వాడీ కేంద్రాలను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తున్నారు. విద్యాశాఖ పాఠశాలలకు ఈ నెల 24వ తేదీ నుంచి వేసవి సెలవులు ప్రకటించగా అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు లేకపోవడంతో వేసవిలో కేంద్రాలను నిర్వహించాల్సి వస్తుండటంతో చిన్నారులకు వేసవి సెగ తప్పేటట్లు లేకపోవడంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రంలో పూర్వ ప్రాథమిక విద్యనభ్యసిస్తున్న చిన్నారులంతా ఏడాది నుంచి ఆరు సంవత్సరాల్లోపు వయస్సు ఉన్న వారే. అంగన్‌వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ప్రకటించకుండా వేళల కుదింపుతో సరిపెట్టడంతో చిన్నారులకు వేసవికాలం అగ్ని పరీక్షగా మారింది. వసతులు లేమి, అద్దె భవనాలు, మండుటెండలు చిన్నారులకు శాపంగా మారాయి. ఎండలు అధికం కావడంతో ప్రభుత్వ భవనాలతోపాటు అద్దె భవనాల్లో కొనసాగుతున్న కేంద్రాల్లో చిన్నారులు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. వేసవికాలం కావడంతో ఉదయం 9 గంటల నుంచే భానుడి విశ్వరూపానికి జనాలు విలవిలాడిపోతున్నారు. ఎండ తీవ్రతకు ఆరేళ్లలోపు చిన్నారుల అవస్థలు వర్ణనాతీతం.

కార్యకర్తలు, ఆయాలకు

15 రోజుల పాటు వేసవి సెలవులు..

అంగన్‌వాడీ కేంద్రాల చిన్నారులకు వేసవి సెలవులు లేకపోగా ప్రభుత్వం కార్యకర్తలు, ఆయాలకు నామమాత్రపు వేసవి సెలవులతో సరిపెట్టింది. మే 1 నుంచి ఆయాలకు 15 రోజులపాటు మే 16 నుంచి 31వ తేదీ వరకు కార్యకర్తలకు వేసవి సెలవులున్నాయి. ఆయాలకు 15 రోజులు, కార్యకర్తలకు 15 రోజుల చొప్పున సెలవులు కేటాయించింది. జూన్‌ 1వ తేదీ నుంచి అంగన్‌వాడీ కేంద్రాలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు యఽథావిధిగా కొనసాగుతాయి.

వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ,ప్రైవేట్‌ పాఠశాలలకు ప్రభుత్వం ఈ నెల 24 తేదీ నుంచి వేసవి సెలవులు ప్రకటించింది. అంగన్‌వాడీ కేంద్రాలను విస్మరించడంతో ఎండతీవ్రతకు చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేకపోవడంతో వసతులు లేని భవనాల్లో చిన్నారులు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. వారి వయస్సును పరిగణలోకి తీసుకుని అంగన్‌వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ఇవ్వాలి. – ఓబులేసు, ఆర్పీఎస్‌ విద్యార్థి సంఘం నాయకుడు, కోవెలకుంట్ల

పాఠశాలలకు వేసవి సెలవులు

ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

వేసవిలోనూ అంగన్‌వాడీ కేంద్రాల

నిర్వహణ

జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు

చిన్నారులకు తప్పని వేసవి సెగ

Advertisement
 
Advertisement
Advertisement