ఆళ్లగడ్డ: అహోబిల దివ్యక్షేత్రంలో నరసింహ స్వామి జయంతి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఎగువ అహోబిలంలో గురువారం ఉదయం యోగా నరసింహ గరుడ వాహన, రాత్రి హనుమంత వాహన సేవ నిర్వహించారు. భక్తులు లక్ష్మీనరసింహ స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మరర్లాను దర్శించుకుని తరించారు. తెల్లవారుజామున మూలమూర్తి జ్వాలా నరసింహస్వామి, చెంచు లక్ష్మీ అమ్మవార్లను మేలుకొలిపి, సుప్రభాత సేవ, నిత్యపూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను యాగశాలలో కొలువుంచి అర్చన, అభిషేకాలు నిర్వహించారు. ఆతర్వాత శ్రీ జ్వాలా నరసింహ స్వామి ఉభయ దేవేరులతో యోగానంద గరుడ విమాన వాహనంలో కొలువై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కనువిందు చేశారు. రాత్రి శ్రీ జ్వాలా నరసింహస్వామి హనుమంత వాహనంపై కొలువై భక్తులను అనుగ్రహించారు.


