● జిల్లాలో మూతపడుతున్న
పెట్రోల్ బంక్‌లు
నంద్యాల(అర్బన్)/బనగానపల్లె: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత వాహన దారులను భయపెడుతోంది. నంద్యాల పట్టణంతో పాటు బనగానపల్లె, కోవెలకుంట్ల తదితర ప్రాంతాల్లో గురువారం పలు పెట్రోల్ బంక్‌లు మూతపడ్డాయి. జిల్లా 167 పెట్రోల్ బంక్‌లు ఉండగా ప్రతి రోజు ఇంధనం సరఫరా అయ్యేది. ప్రస్తుతం రెండు మూడు రోజులకు ఒకసారి ఇంధనం సరఫరా జరుగుతుండటంతో వాహన దారులు ఇంధనం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంధనం సరఫరాలో అధికారుల పర్యవేక్షణ లోపాలు ఉన్నాయని, పరిస్థితి ఇలాగే కొనసాగితే రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని వాహనదారుల భావిస్తున్నారు. జిల్లా అధికారులు కొరత లేదంటూ ఓ వైపు చెబుతుండగా వాహన దారులు మాత్రం ఇంధనం కోసం అన్ని పెట్రోల్ పంపుల వద్దకు పరుగులు తీస్తున్నారు. పంపుల యజమానులు కొందరు కృత్రిమ కొరత సృష్టిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.


