శ్రీశైలంటెంపుల్: ఆరుద్రోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు స్వర్ణరథోత్సవం నిర్వహించారు. వేకువజామున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు చేశారు. స్వర్ణరథోత్సవంలో ముందుగా అర్చకస్వాములు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. అనంతరం రథారూఢులైన శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిపించారు. ఉదయం 7.30గంటలకు స్వర్థరథోత్సవం ప్రారంభమైంది. రథోత్సవంలో కోలాటం, తాళం భజన, డోలు వాయిద్యం, చెక్కభజన మొ దలైన జానపద కళారూపాలు అలరించాయి. స్వర్ణరథోత్సవంలో శ్రీశైల దేవస్థాన ఆలయ ఏఈవో వెంకటేశ్వరరావు, అర్చకస్వాములు, వేదపండితులు, పలు వి భాగాల అధికారులు, పర్యవేక్షకులు, ఇతర సిబ్బంది, శివసేవకులు, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


