పోతిరెడ్డిపాడును పరిశీలించిన కేఆర్‌ఎంబీ చైర్మన్‌ | - | Sakshi
Sakshi News home page

పోతిరెడ్డిపాడును పరిశీలించిన కేఆర్‌ఎంబీ చైర్మన్‌

Apr 23 2026 8:42 AM | Updated on Apr 23 2026 8:42 AM

జూపాడుబంగ్లా/ పాములపాడు: పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ను బుధవారం కృష్ణా రివర్‌బోర్డు చైర్మన్‌ సుబ్రాంగ్‌ షూ బిశ్వాన్‌, కమిటీ మెంబర్లు జాన్‌గిడ్‌, సతీష్‌ కాంబోజీ పరిశీలించారు. శ్రీశైలంలో ఎన్ని అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడు ఎవరి అనుమతితో నీటిని విడుదల చేస్తారని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బానకచెర్ల క్రాస్‌ రెగ్యులేటరును సందర్శించారు. తెలుగుగంగ, కేసీసీ ఎస్కేప్‌, జీఎన్‌ఎస్‌ఎస్‌ గేట్లను పరిశీలించారు. అనంతరం నీటిపారుదల శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షలో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు, పంపిణీలో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులను బోర్డు బృందం దృష్టికి అధికారులు తీసుకువచ్చారు. సాగు, తాగు నీటి సరఫరాలో బానకచెర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ పాత్ర కీలకమని చెప్పారు. ఎస్‌ఈ శివశంకర్‌రెడ్డి , కృష్ణా రివర్‌ మేనేజ్‌ మెంట్‌ బోర్డు డీఈ పవన్‌, ఈఈ రవీంద్ర, పోతిరెడ్డిపాడు డీఈలు సుబ్రమణ్యంరెడ్డి, నగేష్‌, ఏఈ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎన్‌సీఎల్‌ మేనేజర్‌ రమణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement