పీజీఆర్‌ఎస్‌కు 106 వినతులు | - | Sakshi
Sakshi News home page

పీజీఆర్‌ఎస్‌కు 106 వినతులు

Apr 22 2026 9:24 AM | Updated on Apr 22 2026 9:24 AM

డిగ్రీ పరీక్షల్లో ఆరుగురు డిబార్‌

బొమ్మలసత్రం: స్థానిక జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ సునీల్‌ షెరాన్‌ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో ప్రజల నుంచి 106 వినతులు అందాయి. ఫిర్యాదుల్లో ఎక్కువగా నగదు మోసాలు, భూ తగాదాలు, కుటుంబ వివాదాలకు సంబంధించినవి ఉన్నాయి. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదుదారుల నుంచి అందుకున్న వినతులు పరిశీలించి ఆయా స్టేషన్‌ అధికారులకు పంపామన్నారు. నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలని సూచించామన్నారు.

మద్యం విక్రయాల్లో నిబంధనలు పాటించాలి

నందికొట్కూరు: మద్యం దుకాణదారులు నిబంధనలు పాటించాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని ఎకై ్సజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ హనుమంతరావు హెచ్చరించారు. సోమవారం పట్టణంలోని మద్యం దుకాణాలను ఆయన తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల మధ్యనే మద్యం దుకాణాలను నిర్వహించాలని యజమానులకు ఆదేశించారు. సమయం పాలన పాటించకపోయినా, అధిక రేట్లకు విక్రయించినా చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట కర్నూలు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ జయరాం, నందికొట్కూరు సీఐ రామాంజనేయులు నాయక్‌, ఎస్‌ఐ జఫ్రూల్లా, తదితరులు ఉన్నారు.

కుటీర నిర్మాణ పథకానికి రూ.15 లక్షల విరాళం

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న కుటీర నిర్మాణ పథకానికి సోమవారం హైదరాబాద్‌కు చెందిన చిత్త చంద్రశేఖరరెడ్డి దంపతులు రూ.15 లక్షల విరాళాన్ని డిప్యూటీ కార్యనిర్వహణాధికారి ఎం.రమణమ్మకు అందజేశారు. కుటీర నిర్మాణ పథకంలో భాగంగా గణేశసదన్‌లో షూట్‌ రూము కోసం ఈ విరాళాన్ని అందించారు. విరాళాన్ని అందించిన దాతకు దేవస్థానం తరుఫున స్వామి వారి శేషవస్త్రాలు, లడ్డూప్రసాదాలను అందించి సత్కరించారు.

కర్నూలు కల్చరల్‌: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షల్లో ఆరుగురు విద్యార్థులు డిబార్‌ అయ్యారు. సోమవారం నాలుగో సెమిస్టర్‌ పరీక్షలకు 8,395 మందికి గాను 7,570 మంది విద్యార్థులు హాజరు కాగా 819 మంది గైర్హాజరైనట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.నరసింహులు తెలిపారు. డోన్‌ జీవీఆర్‌ఎస్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రంలో ఇద్దరు, కర్నూలు సెయింట్‌ జోసప్స్‌ కళాశాల, ఉస్మానియా కళాశాల, నంద్యాల పీఎస్‌సీ అండ్‌ కేవీఎస్‌సీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆలూరు శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల కేంద్రంలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఆరుగురు విద్యార్థులు చూచి రాతలకు పాల్పడటంతో డిబార్‌ చేసినట్లు తెలిపారు.

వైభవంగా అక్షయ తృతీయ

మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠంలో అక్షయ తృతీయ వేడుకలు వైభవంగా జరిగాయి. సోమ వారం శ్రీమఠం పీఠాధిపతి సబుధేంద్రతీర్థులు నేతృత్వంలో వేడుకలు నిర్వహించారు. ముందుగా రాఘవేంద్రులకు సుప్రభాత సేవతో పూజ లు ప్రారంభం కాగా రాఘవేంద్రుల మూల బృందావనానికి విశేష పంచామృతాభిషేకం గావించారు. వేడుక ప్రత్యేకతగా మూల బృందావనాన్ని గంధ లేపనంతో విశేషాలంకరణ చేశారు. పీఠాధిపతి చేతుల మీదుగా మహా మంగళహారతి కానిచ్చారు. గ్రామ దేవత మంచాలమ్మ, మూల సంస్థాన పూజలో భాగంగా మూల, జయ, దిగ్విజయ రాముల పూజలో తరించారు. అక్షయ తృతీయ సందర్భంగా భక్తుల రద్దీ కనిపించింది.

Advertisement
 
Advertisement
Advertisement