ఈతకు వెళ్లి బాలుడు మృతి | - | Sakshi
Sakshi News home page

ఈతకు వెళ్లి బాలుడు మృతి

Apr 11 2026 9:04 AM | Updated on Apr 11 2026 9:04 AM

నంద్యాల(అర్బన్‌): సరదాగా ఈతకు వెళ్లి చెక్‌ డ్యాంలో మునిగి 15 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన శనివారం మండలంలోని పొ న్నాపురం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన షేక్‌ మోదిన్‌కుమారుడు షేక్‌ సోహేల్‌ గురువారం హౌసింగ్‌ బోర్డు కాలనీ వద్ద ఉన్న కేసీ కెనాల్‌ చెక్‌డ్యాంలో ఈతకు వెళ్లాడు. లోతు గమనించని సోహేల్‌ డ్యాంలో దూకడంతో మునిగిపోయాడు. సాయంత్రం ఇంటికి చేరని కొడుకు ఏమయ్యాడోనని తల్లిదండ్రులు, బంధువులు గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. శుక్రవారం ఉదయం సోహేల్‌ శవమై తేలాడు. ఈ మేరకు మృతుడి తల్లి షేక్‌ షబానా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement