శిరివెళ్ల: భూ రీసర్వేను త్వరగా పూర్తి చేయాలని జేసీ కొల్లాబత్తుల కార్తీక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక 3వ సేవా కేంద్రం ( సచివాయంను) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. భూ రీసర్వేపై ఆరా తీయగా మండల కేంద్రంలో 11,559 మంది రైతులకు సంభంధించి భూముల సర్వే తుదిశకు చేరుకుందని ఇంకా 2,390 రైతు ఖాతాలకు చెందిన భూములను సర్వే చేయాల్సి ఉందని వీర్‌ఓ ప్రసాదు వివరించారు. వారం లోగా సర్వే పూర్తి చేయాలని జేసీ ఆదేశించారు. ఇతర కేంద్రాలకు పంపుతున్నారన్న ఫిర్యాదు వస్తున్నాయని జేసీ అన్నారు. ఫిర్యాదులు కాకుండా చేసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం చౌక దుకాణాలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు.
కర్నూలు(అగ్రికల్చర్): రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు విత్తన కంపెనీలు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ) పీఎల్ వరలక్ష్మి సూచించారు. శుక్రవారం కల్లూరు మండల పరిధిలోని వివిధ విత్తన ప్రాసెసింగ్ యూనిట్లను అధికారులు తనిఖీ చేశారు. కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేటు పరిధిలోని ఏపీ సీడ్స్ గోదాముల్లో వివిధ విత్తనాల ప్రాసెసింగ్‌ను గమనించారు. విత్తనాల నాణ్యతను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం మహాలక్ష్మి జిన్నింగ్ అండ్ ప్రాసెసింగ్ కేంద్రంలో ప్రాసెసింగ్ చేసిన పత్తి విత్తనాల్లో హెచ్‌టీ పరీక్షలు నిర్వహించారు. అగ్రో లైఫ్లో ప్రైవేటు లిమిటెడ్ పురుగు మందుల గోదామును తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. వ్యవసాయ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమే నిర్వహించాలన్నారు. కర్నూలు ఏడీఏ సాలురెడ్డి, కల్లూరు ఏఓ విష్ణువర్ధన్‌రెడ్డి ఉన్నారు.


