ఏబీఎన్‌ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఏబీఎన్‌ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలి

Apr 11 2026 9:04 AM | Updated on Apr 11 2026 9:04 AM

● వైఎస్సార్‌సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి పాటిల్‌ తిరుమలేశ్వర రెడ్డి

● వైఎస్సార్‌సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి పాటిల్‌ తిరుమలేశ్వర రెడ్డి

కర్నూలు (టౌన్‌): అసభ్య, అభ్యంతరకర వ్యాఖ్యా లు చేసిన ఏబీఎన్‌ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని వైఎస్సార్‌సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి పాటిల్‌ తిరుమలేశ్వర రెడ్డి అన్నారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. భార్యకు, చెల్లెలుకు తేడా తెలియని వ్యక్తి రాధాకృష్ణ అని, చేతిలో పేపరు, టీవీ చానల్‌ ఉంది కదా అని ఏది చెబితే అది రాసి, ఏమంటే అది మాట్లాడి వైఎస్సార్‌సీపీపై బురద జల్లుతామంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. అమరావతికి వైఎస్సార్‌సీపీ వ్యతిరేకం కాదని, ఆ పేరుతో జరుగుతున్న వేల కోట్ల దోపీడీకి వ్యతిరేకమన్నారు. రాష్ట్రంలో అందరి నోట్లో మావిగన్‌ చర్చ జరుగుతోందని, డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగానే మంత్రి అచ్చెన్నాయుడు పిచ్చి ప్రేలాపన మాటాలు మాట్లాడుతున్నారన్నారు. తాము ఎర్రనాయుడు గురించి మాట్లాడవచ్చు అయితే తమకు సంస్కారం ఉందన్నారు. డైవర్షన్‌ పాలిటిక్స్‌ మానుకొని, వెంటనే రాధాకృష్ణ మహిళలకు క్షమాపణలు చెప్పాలన్నారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement