ఉత్తమమైనది హోమియో వైద్యం | - | Sakshi
Sakshi News home page

ఉత్తమమైనది హోమియో వైద్యం

Apr 11 2026 9:04 AM | Updated on Apr 11 2026 9:04 AM

జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ది

కర్నూలు: హోమియో వైద్యం ఉత్తమమైనదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ది అన్నారు. ప్రపంచ హోమియో దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా కోర్టులోని న్యాయసేవా సదన్‌లో ఏర్పాటు చేసిన ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలావెంకటశేషాద్రితో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కబర్ది మాట్లాడుతూ.. హోమియోపతి వైద్యంపై అవగాహన కల్పించడానికి ఉచితవైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి లీలావెంకట శేషాద్రి మాట్లాడుతూ..చిన్నపాటి మందుతోనే తీవ్రమైన వ్యాధులను సైతం నయం చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వ హోమియో వైద్యులు మహదేవ్‌రావ్‌, డాక్టర్‌ పీవీ హరినాథ్‌, కర్నూలు కోర్టుకు సంబంధించిన న్యాయమూర్తులు, బార్‌ అసోసియేషన్‌ ప్రసిడెంట్‌ చంద్రుడు, వైద్యురాలు భారతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement