నాసరరెడ్డి సేవలు ఆదర్శం | - | Sakshi
Sakshi News home page

నాసరరెడ్డి సేవలు ఆదర్శం

Apr 4 2026 8:01 AM | Updated on Apr 4 2026 8:01 AM

జెడ్పీ సీఈఓను సన్మానించిన

అధికారులు, ఎంపీడీఓలు

కర్నూలు(అర్బన్‌): తనదైన శైలిలో విధులు నిర్వహించి అందరి మన్ననలను పొందిన జెడ్పీ సీఈఓ జి. నాసరరెడ్డి అందరికీ ఆదర్శమని పులువురు కొనియాడారు. జెడ్పీ సీఈఓగా విధులు నిర్వహిస్తూ డీఎస్‌జీఎస్‌డబ్ల్యూఓగా అనంతపురానికి పదోన్నతిపై వెళ్తున్న జి. నాసరరెడ్డి సన్మాన కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం స్థానిక జెడ్పీలోని మినీ మీటింగ్‌ హాల్‌లో నిర్వహించారు. జెడ్పీ డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జెడ్పీ సీఈఓ జీవీ రమణారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి జి భాస్కర్‌, ఆదోని డీడీఓ బాలకృష్ణారెడ్డితో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎంపీడీఓ, జెడ్పీ ఏఓ, సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా డీపీఆర్‌సీ కోఆర్డినేటర్‌ మంజులావాణి, ఎంపీడీఓలు జ్యోతి, దస్తగిరిబాబు, దశరథరామయ్య మాట్లాడుతూ నెలలుగా ఎదుర్కొంటున్న అనేక క్లిష్టమైన సమస్యలను కూడా తక్కువ సమయంలోనే సులభంగా పరిష్కరించారని తమ అనుభవాలను వివరించారు. ఫైళ్ల క్లియరెన్స్‌లో ఎప్పుడు జెడ్పీలో జాప్యం జరగలేదన్నారు. నాసరరెడ్డిని మార్గదర్శకంగా తీసుకొని విధులు నిర్వహిస్తామని పలువురు ఎంపీడీఓలు భావోద్వేగంతో అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement