బెట్టింగ్‌తో భవిష్యత్‌ అంధకారం | - | Sakshi
Sakshi News home page

బెట్టింగ్‌తో భవిష్యత్‌ అంధకారం

Mar 31 2026 7:38 AM | Updated on Mar 31 2026 7:38 AM

● జిల్లా ఎస్పీ సునీల్‌షెరాన్‌

● జిల్లా ఎస్పీ సునీల్‌షెరాన్‌

నంద్యాల: క్రికెట్‌ అనేది వినోదం కోసం మాత్రమేనని, బెట్టింగ్‌కు ఆశపడి భవిష్యత్తు అంధకారం చేసుకోవద్దని యువతకు జిల్లా ఎస్పీ సునీల్‌ షెరాన్‌ సూచించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఐపీఎల్‌ క్రికెట్‌ నేపథ్యంలో జిల్లాలో క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని, తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటామన్నా రు. జిల్లా వ్యాప్తంగా బెట్టింగ్‌ నిర్వాహకులపై, ఆన్‌లైన్‌ బుకీలపై ప్రత్యేక పోలీస్‌ బృందాల తో నిరంతర నిఘా ఉంటుందన్నారు. బెట్టింగ్‌ నిర్వహించినా.. ప్రోత్సహించినా.. పాల్గొనే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చనే ఆశతో బెట్టింగ్‌ యాప్‌ల ఉచ్చులో పడవద్దన్నారు. కష్టపడకుండా వచ్చే సొమ్ము శాశ్వతం కాదని, అది భవిష్యత్తును అంధకారం చేస్తుందన్నారు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిఘా ఉంచి, స్మార్ట్‌ ఫోన్లలో ఏ యాప్స్‌ వాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఏ పనుల కోసం స్మార్ట్‌ ఫోన్‌ ఉపయోగిస్తున్నారు.. అనేది గమ నిస్తూ ఉండాలన్నారు. పరిసరాల్లో ఎక్కడైనా బెట్టింగ్‌ జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్‌ 100, 112కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement