బేతంచెర్ల: విద్యార్థి జీవితంలో పదో త రగతి ఎంతో కీలకం. ఉన్నత చదువులకు ఇక్కడే మలుపు. అ యితే ఓ విద్యార్థి పరీక్ష వేళ విషమ పరీక్ష ఎదుర్కొన్నా డు. ఓ వైపు పబ్లిక్ పరీక్షలు జరుగుతున్నాయి. మరో వైపు అనారోగ్యం వేధి స్తోంది. తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రికి వెళ్లగా వైద్యులు అత్యవసర ఆపరేషన్ చేశారు. అయినా మరుసటి రోజు పరీక్ష రాశాడు. ఈ సంఘటన బేతంచెర్లలో చోటు చేసుకుంది. స్థానిక శ్రీనారాయణ స్కూల్ పదో తరగతి చదువుతున్న విద్యార్థి విష్ణువర్ధన్‌రెడ్డికి తీవ్ర కడుపునొప్పి రావడంతో ఆదివారం అపెండిక్స్ ఆపరేషన్ చేశారు. సోమవారం సోషల్ పరీక్ష ఉండటంతో విద్యార్థి తల్లిదండ్రులు విషయా న్ని ఎంఈఓ సోమశేఖర్ ద్వారా డీఈఓ జనార్దన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పరీక్ష రాసేందుకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని డీఈఓ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేర కు విష్ణువర్ధన్‌రెడ్డి ఆస్పత్రి నుంచి వాహనంలో పరీక్ష కేంద్రానికి చేరుకుని పరీక్ష రాశాడు. ఈ మేరకు విద్యార్థుల తల్లి దండ్రులు విద్యాశాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
రూ. 17 కోట్ల ఇంటి పన్నులు వసూళ్లు
శిరివెళ్ల: జిల్లాలో రూ. 17 కోట్ల ఇంటి పన్నులు వసూళ్లయ్యాయని డీఎల్‌పీఓ రాంబాబు అన్నారు. సోమవారం శిరివెళ్ల మేజర్ గ్రామ పంచాయతీలో ఇంటి పన్నుల వసూళ్లపై ఆరా తీశారు. జిల్లాలో రూ.18 కోట్ల మేరకు ఇంటి పన్నులు వసూలు కా వాల్సి ఉండంగా సిబ్బంది కృషితో లక్ష్యాన్ని చేరువ లో ఉన్నామన్నారు. స్థానిక పంచాయతీలో రూ. 40 లక్షలకు గాను రూ. 34 లక్షలు వసూళ్లయ్యాయన్నా రు. ఏప్రియల్ 2 న గ్రామ పంచాయతీలకు స్పెషలాఫీసర్ల నియామకం జాబితా వెలువడుతుందన్నారు. 3వ తేదీ నుంచి ప్రత్యేక అధికారుల పాలన మొదలవుతుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ అశ్వనికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
మహానందీశ్వరుడి హుండీ ఆదాయం రూ. 32.29 లక్షలు
మహానంది: మహానంది క్షేత్రంలో సోమవారం నిర్వహించిన హుండీ కానుకల లెక్కింపు ద్వారా రూ. 32,29,396 ఆదాయం లభించినట్లు ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్థానిక అభిషేక మండపంలో శ్రీ కామేశ్వరీదేవి సహిత శ్రీ మహానందీశ్వర స్వామి వారితో పాటు వివిధ ఆలయాల హుండీ కానుకలను లెక్కించారు. ఆలయాల ద్వారా రూ. 31,91,727 రాగా, అన్నప్రసాదం విభాగం ద్వారా రూ. 22,986, గో సంరక్షణ ద్వారా 14,683 వచ్చిందని చెప్పారు. 31 రోజులకు సంబంధించి ఈ ఆదాయం వచ్చినట్లు వివరించారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఏఈఓ ఎరమల మధు, ఆలయ సూపరింటెండెంట్లు అంబటి శశిధర్‌రెడ్డి, నీలకంఠేశ్వరరాజు, పి.సుబ్బారెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ నాగమల్లయ్య, ఆలయ సిబ్బందితో పాటు శ్రీ బాలాజీ, తిరుమల బాలాజీ సేవా ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.


