ఇరాన్ యుద్ధం గ్యాస్ కష్టాలు తెచ్చిపెట్టింది. సిలిండర్ల సరఫరాలో జాప్యమవుతుండటంతో వినియోగదారులు సతమతమవుతున్నారు. ఉగాది, రంజాన్ పర్వదినాలు వరుసగా రావడం, ఈ సమయంలో గ్యాస్ కొరత ఏర్పడటంతో సిలిండర్ల కోసం నిరీక్షణ తప్పడం లేదు. కొందరికి బుకింగ్ కాకపోవడం, బుకింగ్ అయినా ఓటీపీ వచ్చిన వారికే సిలిండర్లు పంపిణీ చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం శిరివెళ్ల గ్యాస్ స్టాక్ పాయింట్ వద్ద వినియోగదారులు సిలిండర్లను క్యూలో ఉంచి తమ వంతు కోసం నిరీక్షిస్తూ కనిపించారు. సంతోషంగా పండుగ చేసుకోవాల్సిన తాము గ్యాస్ సిలిండర్ల కోసం గంటల తరబడి క్యూలో నిలవాల్సి వచ్చిందని వాపోయారు. – శిరివెళ్ల


