సబ్‌ జైలు తనిఖీ | - | Sakshi
Sakshi News home page

సబ్‌ జైలు తనిఖీ

Mar 21 2026 5:16 AM | Updated on Mar 21 2026 5:16 AM

డోన్‌ టౌన్‌: పట్టణంలోని సబ్‌ జైలును శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జైలులోని బ్యారక్‌లు, భోజనశాలను పరిశీలించారు. అనంతరం ఖైదీలతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. జైలులో వైద్య సేవలు, భోజన వసతుల గురించి తెలుసుకున్నారు. అనంతరం ఏఏ నేరాలపై జైలుకు వచ్చారు.. బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారా.. అని ఆరా తీశారు. బెయిల్‌ కోసం స్వతహాగా న్యాయవాదిని నియమించుకోవడానికి ఆర్ధిక స్థోమత లేని వారికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నుంచి ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తుందన్నారు. ఆయన వెంట సబ్‌ జైలు సూపరింటెండెంట్‌ సురేష్‌, కోర్టు సిబ్బంది ఇందిరా, సరితా, సిబ్బంది తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement