నిర్వహణ కష్టమైంది
కూరగాయలు, నిత్యావసర సరుకులు, గ్యాస్ వినియోగానికి ఒక్కో విద్యార్థికి రోజు రెండు రూపాయాలు మెనూ చార్జీలు అందిస్తున్నారు. గత కొన్నేళ్ల నుంచి మార్కెట్‌లో నిత్యావసరాలు, కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రభుత్వం అందిస్తున్న మెనూ చార్జీలు ఏమాత్రం చాలకపోవడంతో మధ్యాహ్న భోజన పథక నిర్వహణ కష్టంగా మారింది.
– వెంకటలక్ష్మి, అంగన్‌వాడీ వర్క్‌ర్స్, హెల్పర్స్ అసోసియేషన్ నాయకురాలు, కోవెలకుంట్ల
అంగన్‌వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజన పథక నిర్వహణకు ప్రభుత్వం అందిస్తున్న మెనూ చార్జీలు ఏమాత్రం సరిపోవడం లేదు. అరకొరగా ఇస్తున్న చార్జీలు నెల నెలా ఇవ్వకపోడంతో అంగన్‌వాడీలు అప్పులు చేసి చిన్నారులకు భోజనం అందిస్తున్నారు. కూరగాయలు, నిత్యావసరాలు, గ్యాస్‌కు ప్రభుత్వం ఇచ్చే రెండు రూపాయాలు ఏ మాత్రం సరిపోవడం లేదు. మార్కెట్ ధరల ప్రకారం మెనూ చార్జీలను పెంచి అంగన్‌వాడీ కార్యకర్తలను ప్రభుత్వం అదుకోవాలి.
– సుధాకర్, సీఐటీయూ
జిల్లా కార్యదర్శి, కోవెలకుంట్ల
నిర్వహణ కష్టమైంది


