పశ్చిమాన వలసల జోరు
గమ్యం చేరిన లక్ష్యం
న్యూస్‌రీల్
● ఇప్పటికే ఊళ్లు విడిచిన
1.50 లక్షల కుటుంబాలు
● సంక్రాంతి నుంచి కిక్కిరుస్తున్న
వలసబండ్లు
● చదువు మానేసి
తల్లిదండ్రులతో పాటే పిల్లలు
● రోడ్డు ప్రమాదంలో
పదేళ్ల బాలిక మృత్యువాత
● స్థానికంగా ఉపాధి కల్పించని
ప్రభుత్వం
● టీడీపీ నేతలు, ఉపాధి సిబ్బంది
కుమ్మకై ్క దొంగ మస్టర్లు
25 నుంచి మార్కెట్ యార్డు బంద్
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు 25 నుంచి 27వ తేదీ వరకు సెలవు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆదివారం శ్రీ 25 శ్రీ జనవరి శ్రీ 2026
టెంపోలో వలసపోతున్న కందుకూరు గ్రామస్తులు
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు జిల్లాలోని సగానికి పైగా పంచాయతీల్లో ఉపాధి జాడ కరువైంది. 2023–24లో ఇదే సమయంలో ఉపాధి పనులకు కర్నూలు జిల్లాలో 55వేల మంది, నంద్యాల జిల్లాలో 36వేల మంది ఉపాధి పనులకు హాజరయ్యారు. నేడు కర్నూలు జిల్లాలో 21వేలు, నంద్యాల జిల్లాలో 16వేల కు మించని పరిస్థితి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఈ ఏడాది మార్చి 31తో ముగుస్తోంది. ఏప్రిల్ 1 నుంచి వీబీ జి రామ్‌జీ కొత్త పథకం అమల్లోకి రానుంది. కొత్త పథకం ఏ విధంగా ఉంటుందో, ఏమోననే ఉద్దేశంతో ఫీల్డ్ అసిస్టెంట్, మేట్ మొదలుకొని ఏపీఓ స్థాయి వరకు దోపిడీకి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. టీడీపీ నేతలు ఉపాధి సిబ్బందితో కుమ్మకై ్క ఉపాధి నిధులను కొల్లగొడుతున్నారు. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంతో పాటు, నంద్యాల జిల్లాలోని డోన్ నియోజకవర్గం నుంచి ఇప్పటికే లక్ష కుటుంబాలు వలసబాట పట్టాయి. రానున్న రోజుల్లో మరో 50వేల కుటుంబాలు వలస వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
నిత్యం వలసలే..
సంక్రాంతి పండగ తర్వాత జిల్లా నుంచి నిత్యం వందలాది కుటుంబాలు పొట్ట చేతపట్టుకొని వలసబాట పడుతుండటం ఆందోళన కలిగించే విషయం. ఇళ్లకు తాళం వేసి బడికి వెళ్లే పిల్లలను సైతం వెంట పెట్టుకొని గుంటూరు ప్రాంతంలో మిర్చి తెంపడానికి పోతున్నారు. ప్రధానంగా కోసిగి, మంత్రాలయం, కౌతాళం, ఆస్పరి, హొళగుంద, హాలహర్వి, పెద్దకడుబూరు మండలాల నుంచి వలసలు అధికంగా ఉంటున్నాయి. డిసెంబర్ నెల చివరికే వ్యవసాయ పనులు పూర్తి కావడం, రబీలో వ్యవసాయం లేకపోవడంతో వ్యవసాయ కూలీలు.. సన్న, చిన్న, మధ్యకారు రైతులకు ఉపాధి కష్టమైంది. వలసపోతున్నప్పటికీ ఈ మండలాల్లోని సగం పంచాయతీల్లో ఉపాధి పనులు లేకపోవడం గమనార్హం. ఈ నెల 23న కోసిగి మండలం కామన్‌దొడ్డి గ్రామం నుంచి అనేక కుటుంబాలు వలస వెళ్లాయి. ఈ గ్రామంలో ఉపాధి పనులే కల్పించలేదు. దీంతో వలసబాట పట్టిన నగేష్, ఉరుకుందమ్మలు అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడింది.
పశ్చిమ ప్రాంతంలోని పలు మండలాల మీదుగా తుంగభద్ర నది ప్రవహిస్తోంది. వాస్తవానికి ఈ నది పశ్చిమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి. నడిమధ్యలో నది ప్రవహిస్తున్నా పంటలు సాగు వర్షాధారంపైనే ఆధారపడాల్సి వస్తోంది. కళ్లెదుటే నీరు కనిపిస్తున్నా రబీ సీజన్‌లో భూములు ఖాళీ ఉంచుకోక తప్పని పరిస్థితి. తుంగభద్ర నదిపై పశ్చిమ ప్రాంతంలో ఎలాంటి ప్రాజెక్టులు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఇటు ఉమ్మడి రాష్ట్రాన్ని, అటు విభజిత రాష్ట్రానికి 16 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కరువుపీడిత ప్రాంతమైన ఆదోని రెవెన్యూ డివిజన్‌పై పగపట్టారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వేదవతి నదిపై ప్రాజెక్టుకు డీపీఆర్ సిద్ధమైనా చంద్రబాబు ప్రభుత్వం పక్కనపెట్టడం గమనార్హం.
సా్థనికంగా పనుల్లేక ఊళ్లకు ఊళ్లు ఖాళీ అవుతున్నాయి. గత శుక్రవారం కోసిగి మండలంలోని కామన్‌దొడ్డి, కందుకూరు గ్రామస్తులతో పాటు కౌతాళం మండలం తిప్పలదొడ్డి గ్రామానికి చెందిన కూలీలు 8 టెంపోలలో దాదాపు 300 మందికి పైగా కోసిగి మీదుగా వలస వెళ్లారు. గ్రామాల్లో వ్యవసాయ పనులు లేకపోవడంతో గుంటూరులో మిరప పనులకు తరలిపోతున్నారు. కందుకూరు గ్రామానికి చెందిన కూలీలు ఇప్పటి వరకు వలస వెళ్లిన దాఖలాల్లేవు. అయితే ఈ ఏడాది తుంగభద్ర నదికి హోస్పేట్ డ్యాం నుంచి వ్యవసాయానికి నీళ్లు ఇవ్వకపోవడంతో గ్రామంలో వ్యవసాయ భూములు సాగుకు నోచుకోలేదు. దీంతో ఆ గ్రామస్తులు పనుల్లేక ఊరు విడవాల్సి వచ్చింది. ఆయా గ్రామాల్లో కూలీలు ఇళ్లకు తాళాలు వేసి పిల్లలతో కలిసి కన్నీటి పయనమయ్యారు. – కోసిగి
భారీ వాహనాలను నడుపుతున్న మహిళల జా బితాలోకి కర్నూలు నగరానికి చెందిన యువతి విశ్వవాణి చేరనుంది. ఈమె ఆర్‌టీసీ బస్సును సునాయసంగా నడుపుతున్నారు. 8లోu
కాకి లెక్కలతో సరి..
కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు 56,90,338, నంద్యాల జిల్లాలో 55,18,093 పని దినాలు కల్పించినట్లు లెక్కలు చూపుతున్నారు. ఈ ప్రకారం ఉమ్మడి జిల్లాలో 1.11 కోట్ల పనిదినాలు కల్పించినట్లు స్పష్టమవుతోంది. ఆ ప్రకారం చూస్తే ఉమ్మడి జిల్లాలో 100 రోజుల పని దినాలు పూర్తి చేసుకున్న కుటుంబాలు కనీసం 20వేలు ఉండాలి. గత 10 నెలల కాలంలో కర్నూలు జిల్లాలో 2,041, నంద్యాల జిల్లాలో 2,590 కుటుంబాలు మాత్రమే 100 రోజుల పని దినాలు పూర్తి చేసుకున్నాయి. బోగస్ మస్టర్లు వేయడం వల్లే పని దినాలు పెరిగినట్లు తెలుస్తోంది. పెద్దకడుబూరు అనావృష్టి మండలం. ఈ మండలంలో కేవలం 10 కుటుంబాలు మాత్రమే 100 రోజులు పూర్తి చేసుకున్నాయంటే ఉపాధి పనుల తీరు ఏ విధంగా ఉందో స్పష్టమవుతోంది.
పశ్చిమాన వలసల జోరు


