మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు షురూ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు చకచక సాగుతున్నాయి. ఫిబ్రవరి 8 నుంచి 18వ తేదీ వరకు జరిగే ఉత్సవాల నేపథ్యంలో దేవస్థానంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఇప్పటికే శ్రీశైల దేవస్థాన ఈఓ ఆధ్వర్యంలో రెండు సార్లు, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాగంతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు శ్రీగిరిలో చేయాల్సిన ఏర్పాట్లపై దేవస్థాన ఇంజనీరింగ్ అధికారులు నిమగ్నమైనారు. శ్రీశైలంలో జర్మన్‌షెడ్లతో తాత్కాలిక క్యూ కంపార్ట్‌మెంట్లు, ప్రధాన ఆలయానికి ఎదురుగా ఇరువైపులా భక్తులు సేదతీరేందుకు భారీ షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఉచిత క్యూలైన్ ప్రవేశ మార్గం వద్ద టెంజైల్ షెడ్‌తో మరో క్యూకంపార్ట్‌మెంట్‌ను ఏర్పాటు చేశారు. అలాగే శివదీక్ష శిబిరాల వద్ద తాత్కాలిక ఏర్పాట్లు, మరుగుదొడ్లు, టాయిలెట్లు, పార్కింగ్ ప్రదేశాల ఏర్పాటు చేస్తున్నారు. చలువ పందిళ్లు, షామియానాలు, ఉద్యానవనాల్లో, ఆరుబయలు ప్రదేశాల్లో షామియానాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇరుముడి కలిగిన శివస్వాములకు ప్రత్యేక క్యూలైన్లు అందుబాటులోకి తెస్తున్నారు. పాతాళగంగ వద్ద ఇనుప మెష్‌తో బారికేడింగ్, ప్రధాన రోడ్లలో డివైడర్లకు పెయింటింగ్ వేస్తున్నారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు షురూ


