నత్తనడకన పత్తి కొనుగోళ్లు
కర్నూలు(అగ్రికల్చర్): మద్దతు ధరతో పత్తి కొనుగోళ్లకు డిమాండ్ ఉన్నప్పటికీ సీసీఐ మాత్రం నత్తనడకన కొనుగోళ్లు చేస్తుండటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో 7.02 లక్షల ఎకరాల్లో పత్తి సాగయింది. ఆదోని, ఎమ్మిగనూరు, పెంచికలపాడు, మంత్రాలయంలో 16 పత్తి జిన్నింగ్ మిల్లుల్లో మద్దతు ధరతో సీసీఐ పత్తి కొను గోలు చేస్తోంది. జిల్లాలో దాదాపు 70 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చింది. దిగుబడు లు భారీగా ఉన్నప్పటికీ సీసీఐ కొనుగోళ్లలో వేగం పెంచకపోవడం గమనార్హం. ఇప్పటి వరకు 49వేల ఎకరాల్లో పండించిన 4.89 లక్షల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసింది. కొనుగోళ్లు అందుబాటులో వచ్చే సమయానికే రైతులు దాదాపు 10 లక్షల క్వింటాళ్లు ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డు, ప్రయివేటు జిన్నింగ్ మిల్లుల్లో అమ్ముకున్నారు. రైతుల దగ్గర ఇంకా 5.3 లక్షల ఎకరాల్లో పండించిన 55 లక్షల క్వింటాళ్ల పత్తి నిల్వలు పేరుకపోయాయి. మద్దతు ధర రూ. 8100 ఉండగా.. మార్కెట్‌లో లభిస్తున్న ధర రూ.6వేల నుంచి రూ.6,800 వరకు మాత్రమే ఉంటోంది.
కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు
తేమ, రంగు విషయంలో కాస్త ఉదారంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి సీసీఐ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ మంత్రి అచ్చేన్నాయుడు అయితే 16–18 శాతం వరకు తేమ ఉన్నా అనుమతించాలని సీసీఐని ఆదేశించినట్లు ప్రకటించారు. కానీ సీసీ ఐ అధికారులు ఏ ఒక్కరి ఆదేశాలను పట్టించుకోని పరి స్థితి నెలకొంది. 12 శాతం కంటే తేమ ఉంటే నిర్దాక్షిణ ్యంగా వెనక్కు పంపుతుండటం గమనార్హం. తిరస్కరించిన పత్తిని దళారీలు కొని అదే పత్తిని మద్దతు ధరతో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. సీసీఐ అధికారులే ముడుపుల కోసం దళారీలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఖాతాలకు జమకాని నగదు
మద్దతు ధరతో పత్తి అమ్ముకున్న రైతులకు గత నెల 28 నుంచి నగదు జమ కావడం లేదు. వ్యవసాయ ఉత్పత్తులు చేతికి రావడంతోబ్యాంకర్లతోపా టు ప్రయివేటు వడ్డీ వ్యా పారులు రైతులపై రు ణాల వసూలుకు ఒత్తిడి చేస్తున్నా రు. అయితే ఇప్ప టి వరకు నగ దు జమ కాకపోవడంతో రైతులు సీసీఐ అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.


