పదవి పోయినా అదే వ్యామోహం!
డోన్: పదవి పోయినా ఆ వ్యామోహం పోదనే నానుడి డోన్ నియోజకవర్గ టీడీపీ నాయకులకు అక్షరాలా వర్తిస్తోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్యాపిలికి చెందిన రాజా నారాయణమూర్తికి వ్యవసాయ మార్కెట్‌యార్డు చైర్మన్ పదవి దక్కింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన టీడీపీలో చేరారు. పదవీ కాలం ముగిసినా కూడా అదే కాంక్షతో తన సొంత వాహనంపై మార్కెట్‌యార్డు చైర్మన్ అనే పేరును తొలగించకుండా చక్కర్లు కొడుతున్నారు. ఇదిలా ఉండగా టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి రెండోసారి కూడా రాజా నారాయణమూర్తి పేరును మార్కెట్‌యార్డు చైర్మన్ పదవికి అధిష్టాన వర్గానికి సిఫారసు చేశారు. అయితే ధర్మవరం సుబ్బారెడ్డి దీనిని పూర్తిగా వ్యతిరేకించారు.


