గ్రాట్యుటీ చట్టాన్ని అమలు చేయాలి
నంద్యాల(అర్బన్): వెంటనే గ్రాట్యుటీ చట్టాన్ని అమలు చేయాలని సహకార ఉద్యోగుల యూనియన్ నాయకులు సత్యనారాయణ, ఖాజామొహిద్దీన్ డిమాండ్ చేశారు. జీవో నం.36ను వెంటనే అమలు చేసి, పెండింగ్‌లో ఉన్న వేతన సవరణలు పరిష్కరించి, అప్పటి వరకు మధ్యంతర భృతి ఇవ్వాలని కోరుతూ మంగళవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగులకు రూ.5 లక్షలు తక్కు వ కాకుండా ఆరోగ్య బీమాను కల్పించాలన్నారు. 2019 తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలన్నారు. సహకార సంఘాలు చెల్లించిన షేర్ ధనంపై డివిడెంట్ కనీసం ఆరు శా తం చెల్లించాలన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న అసి స్టెంట్ ఎగ్జిక్యూటివ్, క్లర్క్‌లతో పాటు కంప్యూటర్ ఆపరేటర్లను సీనియార్టీ ప్రాతిపదికన జిల్లాలో ఖాళీగా ఉన్న సీఈఓ పదవుల్లో భర్తీ చేయాలన్నా రు. కార్యక్రమంలో సంఘం నాయకులు రఘు రాం, వీరభద్రుడు, తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేట్ బస్సుకు
రూ.4.42 లక్షల జరిమానా
డోన్ టౌన్: రోడ్డు ట్యాక్స్ చెల్లించకుండా తిరుగుతున్న ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సుపై రూ. 4,42,500 జరిమానా విధించినట్లు డోన్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ క్రాంతికుమార్ తెలిపారు. మంగళవారం జాతీయ రహదారి 44పై వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో నాగాలాండ్‌కు చెందిన ధనుంజయ ట్రావెల్స్ బస్సు కోయంబత్తూరు నుంచి హైదరాబాద్‌కు ప్రయాణికులతో వెళ్తుండగా నిలిపి తనిఖీ చేశారు. రోడ్డు ట్యాక్స్ చెల్లించకపోవడంతో రూ. 4,42,500 జరిమానా విధించినట్లు ఎంవీఐ తెలిపారు.
మద్దిలేటయ్య హుండీ ఆదాయం రూ.37.66 లక్షలు
బేతంచెర్ల: ఆర్‌ఎస్ రంగాపురం శివార్లలో వెలసిన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.37. 66 లక్షలు వచ్చింది. స్వామి, అమ్మవార్లకు భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలు, ముడుపుల లెక్కింపు మంగళవారంచేపట్టారు. దేవదాయశాఖ అధికారి జనార్దన్ పర్యవేక్షణలో ఉప కమిషనర్, ఆలయ ఈఓ రామాంజనేయులు ఆధ్వర్యంలో 47 రోజులకు సంబంధించిన హుండీ లెక్కింపు నిర్వహించారు. ఇందులో 37,66,502 నగదు, 1.20 మిల్లీ గ్రాముల బంగారు, 660.30 మిల్లీ గ్రాముల వెండి వచ్చింది. కార్యక్రమంలో బాలాజీ సేవా ట్రస్ట్ సభ్యులు, డోన్, బేతంచెర్ల మద్దిలేటి సేవా సమితి, వాసవీ సభ్యులు పాల్గొన్నారు.
గ్రాట్యుటీ చట్టాన్ని అమలు చేయాలి
గ్రాట్యుటీ చట్టాన్ని అమలు చేయాలి


