
చౌడేశ్వరిదేవి ఆభరణాల లెక్కింపు
బనగానపల్లె రూరల్: నందవరంలో వెలిసిన శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారికి భక్తులు విరాళంగా అందజేసిన బంగారు, వెండి ఆభరణాల లెక్కింపు కార్యక్రమం రాయలసీమ జోన్ జువెలరీ వెరిఫికేషన్ అధికారి పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టారు. 2005 సంవత్సరం నుంచి బంగారు, వెండి ఆభరణాలు లెక్కింపు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు మొత్తం 7.436 కేజీల బంగారు ఆభరణాలు ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. 139.500 గ్రాముల ఆభరణాలకు రశీదులు లేకపోవడంతో వాటిని రాయించారు. వెండి ఆభరణాలను బుధవారం పరిశీలించనున్నట్లు పాండురంగారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో గత ఈవో రామానుజన్, ఆలయ అర్చకులు, వెరిఫికేషన్ అధికారులు పాల్గొన్నారు.
నేటి నుంచి న్యాయవాదుల విధుల బహిష్కరణ
నంద్యాల(వ్యవసాయం): కర్నూలులో హైకోర్టు బెంచి త్వరగా ఏర్పాటు చేయాలని కోరుతూ కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ పిలుపు మేరకు నంద్యాల బార్ అసోసియేషన్ నాయ కులు బుధవారం నుంచి రెండు రోజుల పాటు కోర్టు విధులను బహిష్కరిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు హుసేన్‌బాషా, సుబ్బరాయు డు, ముక్కెర కృష్ణారెడ్డిలు మంగళవారం తెలిపారు. విధుల బహిష్కరణ కార్యక్రమానికి న్యాయవాదులు, కక్షిదారులు, కోర్టు సిబ్బంది సహకరించాలని వారు కోరారు.
రెండు రోజులు ప్రైవేటు
పాఠశాలలకు సెలవు
నంద్యాల(న్యూటౌన్): ప్రధాని నరేంద్రమోదీ ఉమ్మడి జిల్లా పర్యటన నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రైవేటు పాఠశాలలకు బుధ, గురువారా లు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు జనార్దన్‌రెడ్డి మంగళవారం ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 15, 16వ తేదీల్లో ప్రైవేటు యాజమాన్య పాఠశాలల కు మాత్రమే సెలవు ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ తేదీల్లో జరిగే ఎఫ్‌ఏ–2 పరీక్షలు 21, 22 తేదీల్లో నిర్వహించడం జరుగుతుందన్నారు.
మద్యం బాటిళ్లపై క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి
నంద్యాల: నకిలీ మద్యం అనే అనుమానం వస్తే మద్యం బాటిల్‌పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే తెలిసిపోతుందని జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రవికుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ ఎకై ్సజ్ సురక్ష యాప్‌ను ప్లేస్టోర్‌లోకి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవాలని, మద్యం కొనుగోలు చేసేటప్పుడు ఈ యాప్ ద్వారా స్కాన్ చేయాలన్నారు. మద్యం బాటిల్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే బాటిల్ తయారు అయిన కంపెనీ, తయారు చేసిన తేదీ, కంపెనీ, ఎమ్మార్పీ ధరతో సరి చూసుకొని కొనుగోలు చేయవచ్చన్నారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు ఏవైనా తప్పులు వస్తే టోల్‌ఫ్రీ నం.14405, 9440902586 ఫోన్ చేయాలన్నారు. హోలోగ్రాఫిక్, ఎకై ్సజ్ లేబుల్స్ బీర్లపై ఉండవని, మద్యం బాటిళ్లపై మాత్రమే ఉంటాయన్నారు. ఏపీ ఎకై ్సజ్ సురక్ష యాప్‌ను ఉపయోగించుకోవాలన్నారు.