
సాగునీటి రంగానికి తీవ్ర అన్యాయం
బీజేపీ డిక్లరేషన్‌లో పెండింగ్ ప్రాజెక్టులకు రూ.10 వేల కోట్లు కేటాయించాలని పెట్టారు. ఆ నిధుల ద్వారా సిద్దేశ్వరం అలుగు, గుండ్రేవుల, వేదవతితో రాయలసీమను సస్యశ్యామలం చేయవచ్చన్నది వారి ఆలోచన. అయితే అందుకు సంబంధించిన నిధులను కేటాయిండంలో విఫలం కావడంతో రాయలసీమ రైతాంగానికి తీరని అన్యాయం జరుగుతోంది. వర్షాలు సమృద్ధిగా పడినా సముద్రం పాలవుతున్నాయి. వర్షపు నీటిని ఒడిసి పట్టుకునే పరిస్థితి లేకపోవడంతో కళ్లెదుటే నీళ్లున్నా పొలాల్లో కన్నీళ్లు పారుతున్నాయి.
రాయలసీమలోని ఓర్వకల్లు(కర్నూలు), కొప్పర్తి(వైఎస్‌ఆర్)లలో పారిశ్రామిక వాడలు ఉన్నాయి. వాటిని వృద్థిపథంలోకి తేవడానికి కేంద్రం చేయూత ఎంతో అవసరం. అయితే ఆ దిశగా కేంద్రం చర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ పార్కులో 10 వేల ఎకరాలతో ల్యాండ్ బ్యాంకును ఏర్పాటు చేసినా మౌలిక వసతుల కల్పనలో విఫలంతో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు రావడంలేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పారిశ్రామికవాడలపై దృష్టి సారించాల్సి ఉంది.

సాగునీటి రంగానికి తీవ్ర అన్యాయం