
వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం
నంద్యాల(వ్యవసాయం): 70 ఏళ్లు పైబడిన వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందజేస్తానని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి లీలా వెంకట శేషాద్రి తెలి పారు. శుక్రవారం పట్టణంలోని సైబ్‌జైల్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జడ్జి ఖైదీలతో మాట్లాడుతూ.. సబ్‌జైల్‌లో నెలకొన్న సమస్యలు ఉంటే న్యాయవాదుల దృష్టికి తీసుకురావాలన్నారు. అదే విధంగా జైళ్లలోని ఖైదీల సంఖ్య, కేసుల వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. వారి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జైలు సూపరింటెండెంట్ గురుప్రసాదరెడ్డి, న్యాయవాది బాలు, లోక్ అదాలత్ సిబ్బంది రామచంద్రారెడ్డి, తదితరులు ఉన్నారు.
ఎల్లెల్సీలో జారి పడి మహిళ మృతి
ఆదోని అర్బన్: ఇస్వీ గ్రామానికి చెందిన యాస్మిన్ (30) ఎల్లెల్సీ కాలువలో ప్రమాదవశాత్తూ జారి పడి మృత్యువాత పడింది. శుక్రవారం తన సొంతూరు పెద్ద హరివాణంలోని కుటుంబీకులను చూసేందుకు యాస్మిన్ భర్త నబీసాహెబ్‌తో కలసి సొంత ఆటోలో వెళ్లారు. సాయంత్రం తిరిగి వస్తుండగా నబీసాహెబ్ మలవిసర్జనకు ఆటో నిలిపాడు. ఈ క్రమంలో యాస్మిన్ కాలువలో ముఖం కడిగేందుకు వెళ్లి జారి కాలువలో పడిపోయి కేకలు వేసింది. గమనించిన భర్త వెంటనే స్థానికుల సహయాంతో ఒడ్డుకు చేర్చారు. అస్వస్థతకు గురైన ఆమెను ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.

వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం