
సమాచార శాఖ డీఐపీఆర్‌ఓగా మల్లికార్జునయ్య
నంద్యాల: జిల్లా డీఐపీఆర్‌ఓగా మల్లికార్జునయ్యను నియమిస్తూ సమాచార శాఖ డైరెక్టర్ హిమాన్స్‌శుక్లా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తు తం ఇక్కడ పని చేస్తున్న పురుషోత్తంను సత్యసాయి జిల్లాకు బదిలీ చేశారు. ఈ మేరకు జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి (డీఐపీఆర్‌ఓ)గా జె.మల్లికార్జునయ్య ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో డీపీఆర్‌ఓగా విధులు నిర్వహిస్తూ కర్నూలు సహాయ సంచాలకులుగా పదోన్నతి పొందానన్నారు. దీంతో పాటు నంద్యాల డీఐపీఆర్‌ఓగా పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చారన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి సలహాలు, సూచనలు పాటిస్తూ అధికార కార్యక్రమాలను మీడియా ద్వారా విస్తృతం చేస్తామన్నారు.
కుమారుడిని
హత్య చేసిన తండ్రి అరెస్ట్
దేవనకొండ: కుమారుడిని నీటి డ్రమ్ములో ముంచి హత్య చేసిన తండ్రి నరేష్‌ను అరెస్టు చేసినట్లు సీఐ వంశీనాథ్ ఆదివారం విలేకరులకు తెలిపారు. నిందితుడిని పత్తికొండ మెజిస్ట్రేట్ వద్ద హాజరు పరిచినట్లు చెప్పారు. దేవనకొండకు చెందిన చాకలి నరేష్, శ్రావణికి ఎనిమిది నెలల కుమారుడు సాగర్ ఉన్నాడు. నిత్యం భార్యతో గొడవ పెట్టుకునే నరేష్.. దేవనకొండలో గత రెండు రోజుల క్రితం కుమారుడిని నీటి డ్రమ్ములో ముంచి హత్య చేసిన విషయం తెలిసిందే.