
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో మలేరియా వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నాం. వర్షా కాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. దోమల వల్ల విషజ్వరాలు ప్రబలే అవకాశం ఉంది. సీజన్‌లో వచ్చే వ్యాధుల పట్ల ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించేలా చర్యలు చేపడుతున్నాం. ముందు జాగ్రత్త గా దోమలు కుట్టకుండా చూసుకోవాలి. ప్రాథమిక కేంద్రాల ద్వారా ప్రజలకు వైద్యం అందిస్తున్నాం. ఏదైనా సమస్య వస్తే, జ్వరాలు తగ్గని వారికి జిల్లా ఆసుపత్రికి తరలిస్తున్నాం. వ్యాధి నివారణ అనేది మనం తీసుకొనే జాగ్రత్తలపై ఆధారపడి ఉంటుంది. పరిసరాల్లో మురికినీరు లేకుండా చూసుకోవాలి.
– డాక్టర్ చంద్రశేఖర్‌రావు,
జిల్లా మలేరియా అధికారి, నంద్యాల
ఆసుపత్రిలోని జనరల్ మెడిసిన్ ఓపీకి ప్రతిరోజూ 300 నుంచి 400 మంది రోగులు వస్తున్నారు. అందులో సగానికి పైగా జ్వరపీడితులే ఉంటున్నారు. ఎక్కువశాతం జలుబు, దగ్గు, ఒళ్లునొప్పులు, జ్వరంతో బాధపడుతున్న వారే ఉన్నారు. సీజనల్‌గా వచ్చే వైరల్ ఫీవర్లే ఉంటున్నాయి. జ్వరతీవ్రత 102 నుంచి 104 ఫారిన్‌హీట్ వరకు ఉంటోంది. అవసరమైన వారికి వైద్యనిర్ధారణ పరీక్షలు చేయించి మందులు ఇచ్చి పంపిస్తున్నాం. ఇందులో రోజూ 10 నుంచి 15 మంది అడ్మిషన్ చేస్తున్నాం. కొందరికి మలేరియా లక్షణాలు కనిపిస్తుండటంతో అందుకు సంబంధించిన వైద్యం అందిస్తున్నాం.
–డాక్టర్ కె.సోమప్ప, అసోసియేట్ ప్రొఫెసర్,
జనరల్ మెడిసిన్, జీజీహెచ్, కర్నూలు

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి