
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని మోసం
● ఎస్పీని ఆశ్రయించిన బాధితుడు
నంద్యాల: హైదరాబాదులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి సంఘ తమిళ, సుల్తాన్ ఖాన్ అనే వ్యక్తులు రూ. 6 లక్షలు తీసుకుని మోసం చేశారని, డబ్బు తిరిగి ఇవ్వడం లేదని, న్యాయం చేయాలని శిరివెళ్ల గ్రామానికి చెందిన డక్క నడిపి చింతలన్న జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. అలాగే నందికొట్కూరు మండలం దామగట్ల గ్రామానికి చెందిన షేక్ ఖాజా అనే వ్యక్తి రూ.3.30 లక్షలు తీసుకొని ఇవ్వడం లేదని, అడిగితే దుర్భాషలాడుతూ చంపుతానని బెదిరిస్తున్నాడని వృద్ధురాలు అదే గ్రామానికి చెన్నమ్మ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఫిర్యా దులు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని, గడువులోగా పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పీజీఆర్‌ఎస్‌లో కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేయడం, పొలం తగాదాలు, అన్నదమ్ముల ఆస్తి తగాదాలు వంటి వినతులు 128 వచ్చాయని, వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు.